Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
పుట్టగొడుగుల కూర..దీని రుచి ముందు చికెన్,మటన్ జుజుబీ..ఇలా చేస్తే ఒక్క ముద్ద మిగల్చరు
పుట్టగొడుగుల కూర(mushroom curry)..వండేవాడు ఉండాలేకానీ లొట్టలేసుకొని మరీ వేళ్లు నాక్కోవాల్సిందే. ముద్ద ముద్దలో ముక్క దిగుతుంటే చికెన్ ముక్కా మటన్ ముక్కా ఏం సరిపోతుంది బాసూ.మాంసాహారం ఇష్టపడనివాళ్లకు ఆ రేంజ్ టేస్ట్ కోరుకునేవాళ్లకి ఈ పుట్టగొడుగుల కూరే చికెన్, మటన్. గతంలో నానమ్మలు,అమ్మమ్మలు పుట్టగొడుగుల కూర ఇళ్లల్లో చేస్తుంటే నాకు నాకు అంటూ కూర ఉడకకముందే పొయ్యి దగ్గర ప్టేట్లు పట్టుకుని కూర్చుని ఎప్పుడెప్పుడు పుట్టగొడుగు కూర మన ప్లేట్ లోకి వస్తుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూసేవాళ్లు.
పుట్టగొడుగుల కూర కోసం ముష్ఠి యుద్ధాలు కూడా జరిగేవి. వర్షాకాలం వస్తే పుట్టగొడుగుల వస్తాయి..హాయిగా తినొచ్చు అని నాలుక ఆత్రంగా ఎదురుచూస్తుంటది. అంత రుచికరమై పుట్టగొడుగుల మసాలా గ్రేవీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

పుట్టగొడుగుల మసాలా గ్రేవీ తయారీకి కావాల్సిన
పదార్థాలు
-పుట్టగొడుగులు
-ఉల్లిపాయలు
-టామాటో
-టేబుల్ స్పూన్ల ఆయిల్
-రుచికి తగినంత ఉప్పు
-పుసుపు
-రెండు పచ్చిమిర్చి
-యాలకులు
-జీలకర్ర
-పెరుగు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-దాల్చినచెక్క
-లవంగమెగ్గలు
-జీడిపప్పు
-కరివేపాకు
-కొత్తిమీర
పుట్టగొడుగుల మసాలా గ్రేవీ కర్రీ తయారీ
విధానం
-స్టవ్ మీద పాన్ పెట్టి 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి.
-నూనె వేడెక్కిన తర్వాత అందులో నాలుగు లవంగ మొగ్గలు, 2 చిన్న దాల్చిన చెక్కలు,రెండు యాలకులు,1 టీస్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వండి.
-ఇప్పుడు 2 ఉల్లిపాయలను బాగా సన్నగా తరిగి ఆ తరుమును ఆయిల్ లో వేయాలి.
-ఉల్లిపాయ రంగు మారేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి.
-ఇది వేగేలోగా మసాలా తయారుచేసుకోండి. అందుకోసం మిక్సిలో అర ఇంచు దాల్చిన చెక్క,రెండు యాలకులు,నాలుగు లవంగ మొగ్గలు,2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు,పావు ముక్క పచ్చి కొబ్బరి,రెండు టేబుల్ స్పూన్ల పెరుగు,ఒక మీడియం సైజు టామటోని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి.
-ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేగిన ఉల్లిపాయల్లో వేసి మంటను మీడియంలో పెట్టి బాగా కలుపుకోవాలి.
-నూనె తేలే వరకు ఫ్రై చేసుకోవాలి.
-తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు,చిటికెడు ఉప్పు, రుచికి తగ్గట్లుగా కారం,1 టీ స్పూన్ ధనియాల పొడి,అర టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేయండి.
-ఇప్పుడు 200 గ్రాముల పుట్టగొడుగులను మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని ఇందులో వేసి కలుపుతూ 3 నిమిషాలు వేయించండి.
-ఇఫ్పుడు అందులో రెండు చీల్చిన పచ్చిమిర్చి,రెండు రెమ్మల కరివేపాకు వేసి కలిపి ఇందులో గ్రేవీ పరిణామానికి తగ్గట్లుగా అరకప్పు లేదా ముప్పావు కప్పు నీళ్లు పోసి ఉప్పు సరిపోకుంటే కొంచెం వేసుకొని మూత పెట్టేయండి.
-5 నుంచి 10 నిమిషాల పాటు మంటను తక్కువలో పెట్టి గ్రేవీ కొంచెం గట్టిగా అయ్యేదాకా ఉడికించాలి.
-ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర గ్రేవీపై చల్లుకోండి. టేస్టీ మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications