Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
మటన్ ఫ్రైను సింపుల్‌గా టేస్టీగా ఇలా తయారు చేసుకోండి..! ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయ్..!
ప్రొటీన్ నేరుగా త్వరగా శరీరానికి అందాలంటే మాంసాహారాన్ని తప్పకుండా తీసుకోవాల్సిందే. పిల్లలు, ముఖ్యం గర్భిణులు మాంసం తింటేనే కడుపులో బిడ్డ ఎదుగుదల బాగా జరుగుతుంది. గర్భిణులైన శాఖాహారులు మాంసం తినడానికి ఇష్టపడరు దీని వల్ల వారు ప్రొటీన్ల కోసం ప్రత్యామ్నాయ ఆహారాన్ని తీసుకోవలసి వుంటుంది. మాంసప్రియులకు, ప్రొటీన్లతో నిండిని వంటకం కావాలనుకునే వారికి ఈ సారి మటన్ ఫ్రై రెసిపీని మీ ముందుకు తీసుకొని వచ్చాము. మటన్ ఫ్రై ఎలా తయారు చేసుకుంటారో తెలుసుకుందాం.
మటన్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన వంట సామాగ్రి
బోన్‌లెస్ మటన్, మంచి నీళ్లు, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మంచి నూనె, కారం పొడి, గరం మసాలా, మిరియాల పొడి, దనియాల పొడి, మొక్క జొన్న పిండి, బియ్యం పిండి, ఒక గుడ్డు, సగం నిమ్మకాయ, మటన్ మసాలా, పచ్చి మిరపకాయలు, కరివేపాకులు.
మటన్ ఫ్రై తయారీ విధానం
ముందుగా అరకిలో బోన్లెన్ మటన్‌ను ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న మటన్‌ను నీళ్లతో బాగా కడగాలి. తరువాత ఈ మటన్‌ను కుక్కర్లోకి తీసుకోవాలి. అందులో ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపును, రెండు టీ స్పూన్ల మంచి నూనెను, అర కప్పు నీళ్లను తీసుకోవాలి, ఇప్పుడు కుక్కర్ మూతను క్లోజ్ చేసుకొని మటన్‌ను మెత్తగా ఉడికించాలి. మరీ మెత్తగా కాకుండా, మామూలుగా తినేవిధంగా ముక్కలు ఉడికే వరకు ఉడికిస్తే సరిపోతుంది.
కుక్కర్‌ను 5 నుంచి 6 విజిల్స్ వరకు పెట్టి తరువాత మూతను ఓపెన్ చేసి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో వున్న మటన్ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. కేవలం మటన్ ముక్కలను మాత్రమే తీసుకోవాలి, కుక్కర్లో వుండే సూప్‌ను అలాగే వదిలేయాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న మటన్‌ను మారినేట్ చేసుకోవడానికి కొన్ని ఇంగ్రీడియెంట్స్‌ను యాడ్ చేసుకోవాలి.
మటన్ బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కారంపొడిని, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడిని, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని, ఒక టీ స్పూన్ ధనియాల పొడిని, రుచికి సరిపడ ఉప్పును యాడ్ చేసుకోవాలి, రెండు టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండిని, ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఒక గుడ్డును పగలకొట్టి కేవలం తెల్లసొనను మాత్రమే మటన్ బౌల్లోకి వేసుకోవాలి. ఈ ఎగ్ వైట్ వల్ల మటన్ ఫ్రై మరింత బాగా వస్తుంది. సగం నిమ్మకాయను కూడా ఈ బౌల్లో పిండుకోవాలి. ఇప్పుడు బౌల్లో వేసిన మొత్తాన్ని బాగా మారినేట్ చేసుకోవాలి. మటన్‌కు మొత్తం మసాలా బాగా అంటుకునేలా కలుపుకోవాలి.
ఒప్పుడు ఒక ఖడాయ్ తీసుకొని మటన్‌ను ఫ్రై చేయడానికి సరిపడా మంచినూనెను పొసుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తరువాత మటన్ ముక్కలను అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మటన్ ముక్కలు బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. మటన్ ముక్కలు క్రిస్పీగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. గాట్లు పెట్టిన 5, 6 పచ్చిమిరపకాయలను కూడా అందులోనే వసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మటన్ మరీ మాడిపోకుండా జాగ్రత్తపడాలి. కొన్ని కరివేపాకులను యాడ్ చేసుకోవాలి.
ఫ్రై చేసిన మటన్ ముక్కలను ఒక ప్లేటులో తీసుకొని దానిపై చిటికెడంత ఉప్పు, కారం, గరం మసాలాను మటన్ ఫ్రైపై చల్లుకోవాలి. ఇక దీంతో ప్రొటీన్ లోడెడ్ టస్టీ మటన్ ఫ్రై రెడీ అయినట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










