Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఉల్లిపాయ టమోటో పచ్చడి 2 ఉల్లిపాయలు 1 టమోటో ఉంటే చాలు 10 నిముషాల్లో రెడీ..!
ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు కేవలం రెండు ఉల్లిపాయలు 1 టమోటోలు ఉంటే చాలు . చాలా టేస్టీగా ఉల్లిపాయ టమోటో పచ్చడి తయారుచేసుకోవచ్చు. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి వేసుకుని, కాస్త నెయ్యి వండించి తింటే చాలా కమ్మగా మరో రెండు ముద్దలు ఎక్కువగా తినే విధంగా ఉంటుంది. దీన్ని అన్నంలోకే కాదు చపాతీలోకి కూడా చాలా అద్భుతమైన రుచిని ఇస్తుంది.
ముందుగా ఈ పచ్చడి తయారుచేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారుచేయు విధానం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. ఈ వంట మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ అభిప్రాయన్ని మాతో పంచుకోండి.

Image courtesy: youtube
కావాల్సినపదార్థాలు :
ఉల్లిపాయలు : 2
టమోటో: 1
జీలకర్ర : 1టేబుల్ స్పూన్
నూనె : 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు 10
చింతపండు : నిమ్మపండు సైజ్
ఉప్పు: రుచికి సరిపడా
కారం : 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర : 1 కప్పు
పోపుకోసం :
నూనె: 1టేబుల్ స్పూన్
జీలకర్ర: 1/2టేబుల్ స్పూన్
ఎండు మిర్చి : 2
కరివేపాకు : 2 రెమ్మలు
తయారుచేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి, పాన్ వేడి చేసి , అందులో ఒక
టేబుల్ స్పూన్ నూనె వేసి వేడిచేయాలి.
2. తర్వాత అందులో ఒక టీస్పూన్ జీలకర్ర వేయండి. చిటపటలాడక అందులో రెండు
ఉల్లిపాయలు సన్నగా తరిగిపెట్టుకున్న వేసి మీడియం మంట మీద
వేగించుకోవాలి
3. ఇప్పుడు అందులో 10 వెల్లుల్లి పాయలు కూడా వేసి 5 నిముషాలు మీడియం
మంట మీద వేగించుకోవాలి
4. తర్వాత ఒకటి లేదా 2 పెద్ద టమోటో ముక్కలు వేసి వేగించాలి.
5. అలాగే నిమ్మపండు సైజు చింతపండు కూడా వేయాలి. రుచికి సరిపడా ఉప్పు
జోడించండి
6. అందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారంపొడి లేదా మీ రుచికి సరిపడా
సర్ధుబాటు చేసుకోవచ్చు.
6. మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి.
అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి, మొత్తం మిక్స్ చేయాలి.
7. స్టౌ ఆఫ్ చేసి, మొత్తం మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన
తర్వాత మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్
చేసుకోవాలి.
8. గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలో తీసుకుని పక్కన
పెట్టుకోవాలి.
9. మరో పాన్ ను స్టౌ మీద పెట్టి, నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు,
రెండు ఎండు మిర్చి, రెండు రెమ్మల కరివేపాకువేసి వేగిన తర్వాత దీన్ని
చట్నీలో వేసి బాగా మిక్స్ చేయాలి. . మీకు కావాలనుకుంటే పచ్చి ఉల్లిపాయ
ముక్కలు కూడా వేసుకోవచ్చు.
10. అంతే రుచికరమైన టమోటోఉల్లిపాయ చట్నీ రెడీ . వేడి వేడి అన్నంలో
కాస్త నెయ్యి వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications