Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
మన పూర్వీకులకు ఎంతో ఇష్టమైన పులుసు ఇదే, ఒక్కసారి తింటే జీవితంలో వదలరు.. వాళ్ళ స్టైల్‌లో ఎలా చేసుకోవాలంటే?
ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ప్రాసెస్ చేసిన ఆహారం, అప్పటికప్పుడు రెడీ అయిపోయే ఇన్‌స్టంట్ ఆహారాన్ని తీసుకుంటున్నారు. దీని కారణంగా కడుపు నిండిపోతుందే తప్పా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలగడం లేదు. వెరసి ఎన్నో రకాల రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. మన పూర్వికులు, మన తల్లిదండ్రులు ఎవరూ ఇలాంటి ఆహారాన్ని తీసుకోలేదు. అందుకే వారి ఇప్పటికీ ఆరోగ్యంగా ఆనందంగా తమ జీవితాన్ని గడపగలుగుతున్నారు.
వారు తిన్న ఆహారంలో ఒకటే పచ్చి పులుసు. ఈ పచ్చి పులుసు అప్పట్లో చాలా ఫేమస్. ఇంట్లో ఎలాంటి కూర లేనప్పుడు, కూరగాయలు లేనప్పుడు దీనిని చేసుకొని భోజనం చేసుకునే వారు. అయితే ఈ మధ్యకాలంలో పచ్చి పులుసు తినేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దానికి కారణం వారికి ఆ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో తెలియకపోవడం. అందుకే ఈ స్టోరీలో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? పచ్చి పులుసుతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
చింతపండు - 50 గ్రాములు
బెల్లం - 50 గ్రాములు (లేదా రుచికి సరిపడా)
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
ఎండుమిర్చి - 2
కరివేపాకు - కొద్దిగా
ఆవాలు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
నూనె - 2 టీస్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - చిటికెడు
తయారీ విధానం:
చింతపండును గోరువెచ్చని నీటిలో నానబెట్టి, గుజ్జు తీయాలి.
ఒక పాత్రలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు
వేసి వేయించాలి.
తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు
వేయించాలి.
చింతపండు గుజ్జు, బెల్లం, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి.
పులుసు చిక్కబడే వరకు మరిగించి దించాలి.
వేడి వేడి అన్నంతో పచ్చి పులుసును వడ్డించండి.
ఆరోగ్య ప్రయోజనాలు:
చింతపండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక
శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
బెల్లం ఐరన్ కు మంచి మూలం, ఇది రక్తహీనతను నివారిస్తుంది.
ఇందులో వాడే ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలో విటమిన్లు, ఖనిజాలు
ఉంటాయి.
చిట్కాలు:
పచ్చి పులుసును మరింత రుచికరంగా చేయడానికి, మీరు వేయించిన వేరుశెనగ
గుళ్ళు లేదా కొబ్బరి తురుమును జోడించవచ్చు.
మీరు బెల్లం లేకుండా కూడా పచ్చి పులుసును తయారు చేయవచ్చు.
పచ్చి పులుసును చల్లగా లేదా వేడిగా వడ్డించవచ్చు.
పచ్చిపులుసులో కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు.
రసం మాదిరిగా ఉండే ఈ పులుసు చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులోని ఉల్లిపాయ ముక్కలు ఒక్కొక్కటిగా పంటి కింద తలుగుతుంటే.. పులుసులో ఆ పుల్లదనం, ఆ రుచి, ఉల్లిపాయ ఘాటు అవన్నీ ఎంతో రుచికరంగా అమృతంగా ఉంటుంది. ఇప్పుడున్న కాలంలో దీనిని చేసుకునే సమయం ఎవరికీ ఉండడం లేదు, కానీ ఒక్కసారి చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ అదే కావాలని అడుగుతారు. అలా అని దీనిని చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదు కూడా. అందుకే మీరు కూడా ఓసారి దీనిని మీ ఇంట్లో ట్రై చేసి, రుచి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications