Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
ఓట్స్ పొంగల్..తినకపోతే హెల్దీ బ్రేక్ ఫాస్ట్ మిస్ అయినట్లే..ఎలా చేసుకోవాలంటే
ఓట్స్ పొంగలి ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన,తేలికపాటి అల్పాహారం. ఇది దక్షిణ భారత సంప్రదాయ వంటకం పొంగలికి ఓట్స్ ను ప్రత్యామ్నాయంగా ఉపయోగించి తయారు చేయబడుతుంది. ఓట్స్ పోషకాలతో నిండి ఉండటం వల్ల ఈ వంటకం మరింత ఆరోగ్యకరంగా మారుతుంది. పెరుగుతున్న పిల్లలకు, క్రీడాకారులకు,శాఖాహారులకు ఇది ఒక అద్భుతమైన ప్రోటీన్ వనరు. ఓట్స్ పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఓట్స్ పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు
-రోల్డ్ ఓట్స్: 1 కప్పు
-పెసరపప్పు: 1/2 కప్పు
-నీరు: 3-4 కప్పులు
-నెయ్యి: 2-3 టేబుల్ స్పూన్లు
-ఆవాలు: 1/2 టీస్పూన్
-జీలకర్ర: 1 టీస్పూన్
-ఇంగువ: 1/4 టీస్పూన్
-పచ్చిమిర్చి: 2-3
-అల్లం: 1 అంగుళం ముక్క
-కరివేపాకు: 1 రెమ్మ
-జీడిపప్పు: 10-15
-ఉప్పు: తగినంత
-కొత్తిమీర తరుగు: 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పును తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి.
-కడిగిన పెసరపప్పును ప్రెషర్ కుక్కర్ లో వేసి 1.5 కప్పుల నీటిని పోసి కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పప్పు మెత్తగా కానీ మరీ పేస్ట్ లా కాకుండా ఉండాలి.
-ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి పక్కన పెట్టుకోవాలి.
-ఒక కడాయి లేదా మందపాటి అడుగున ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టి ఓట్స్ ను కడాయిలో వేసి సుమారు 3-4 నిమిషాల పాటు వేయించాలి. ఓట్స్ రంగు మారకుండా, మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి. క్విక్ ఓట్స్ కూడా వాడొచ్చు, కానీ రోల్డ్ ఓట్స్ అయితే పొంగలికి మంచి రుచి, ఆకృతి వస్తుంది.
-వేయించిన ఓట్స్ ను ఒక ప్లేట్\u200cలోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
-అదే కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడైన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడటం ప్రారంభించిన తర్వాత జీలకర్ర వేయాలి. జీలకర్ర వేగిన తర్వాత ఇంగువ, సగం చేసిన జీడిపప్పు ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేసి 1-2 నిమిషాలు వేయించాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
నో మిల్క్, నో షుగర్..ఎక్కువ రోజులు నిల్వ ఉండే సూపర్ టేస్టీ రవ్వ లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే
-తాలింపులోకి వేయించిన ఓట్స్ ను వేసి బాగా కలపాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి మిగిలిన నీరు (1.5 - 2.5 కప్పులు) పోయాలి.
-నీరు మరగడం ప్రారంభించిన తర్వాత మంట తగ్గించి మూత పెట్టి ఓట్స్ మెత్తబడే వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.
-ఓట్స్ పూర్తిగా ఉడికి నీరు ఎక్కువగా లేని స్థితికి చేరుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును ఓట్స్ మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
-అవసరమైతే కొద్దిగా వేడి నీటిని కలుపుకోవచ్చు. పొంగలి మరీ చిక్కగా అనిపిస్తే,కాస్త నీరు పోసి మంటపై 1-2 నిమిషాలు ఉడికించవచ్చు. పొంగలి మీకు నచ్చిన విధంగా చిక్కదనం ఉండేలా చూసుకోండి.
-అన్నీ బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. పొంగలిని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైన తరిగిన కొత్తిమీరతో అలంకరించాలి.
-వేడి వేడి ఓట్స్ పొంగలిని కొబ్బరి చట్నీ, సాంబార్ లేదా పచ్చడితో తింటే నోట్లో బ్లాస్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications