Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ వీకెండ్లో రొయ్యల బిర్యానీని ఇలా ట్రై చేస్తారా..!!
రొయ్యల బిర్యానీని మనం అన్ని బిర్యానీల్లో రొయ్యల బిర్యానీ వేరయా అని చెప్పుకోవచ్చు. ఈ బిర్యానీ వంటకాలు మన దేశంలో మస్లిములు పాలించినప్పటి నుంచి వచ్చాయ్. హైదరాబాద్ బిర్యానీ కూడా అలాగే వచ్చింది. తరువాత రకరకాల కూరగాయలతో బిర్యానీ చేయడం మొదలుపెట్టారు. అలా రొయ్యలతో కూడా బిర్యానీని చేసుకున్నాం. ఈ వీకెండ్లో ఒకసారి రొయ్యల బిర్యాని రెసిపీని ట్రై చేయండి. రొయ్యల బిర్యానీని చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మరి రొయ్యల బిర్యానీని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

రొయ్యల బిర్యానీ తయారు చేయడానికి కావాల్సి పదార్ధాలు ఇవే :
బస్మతి బియ్యం: 2 కప్పులు
రొయ్యలు: 500 గ్రాములు
ఉల్లిపాయలు: 2
టమోటా: 1
పచ్చి మిరపకాయలు: 3-4
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2 టీస్పూన్లు
పుదీనా, కొత్తిమీర ఆకులు
మసాలా పదార్థాలు: ధనియాల పొడి, జీడి కారం, పసుపు, గరం మసాలా, బిర్యానీ
మసాలా, బిర్యానీ ఆవాలు
ఉప్పు
ఉల్లిపాయలు
నెయ్యి, నూనె
ఎండుమిరపకాయలు: 2-3
ఎల్లో ఫుడ్ కలర్: ఒక చిటికెడు
రొయ్యల బిర్యానీ తయారు చేసే విధానం :
1. ముందుగా, బాస్మతి బియ్యం నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తరువాత, నీటిని వడకట్టి, కాస్త ఉప్పు, నూనె వేసి 70% సిద్దమయ్యే వరకు ఉడికించాలి. ఉడికిన బియ్యాన్ని వడగట్టి పక్కన పెట్టాలి.
2. ఒక పెద్ద గిన్నెలో నెయ్యి లేదా నూనెతో నూనె వేడి చేయాలి. అందులో ఉల్లిపాయలు గోధుమరంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు జోడించి రెండు నిమిషాల పాటు వేపాలి.
3. మసాలా తగినంత ఫ్రై అయిన తరువాత, రొయ్యలు వేసి, పసుపు, ధనియాల పొడి, జీడి కారం, బిర్యానీ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. రొయ్యలు సన్నని మంట మీద 5-6 నిమిషాల పాటు వేపి, టమోటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర ఆకులు వేసి మరో 2 నిమిషాలు వేయించాలి.
4. ఒక బిర్యానీ పాత్ర తీసుకొని అందులో మసాలాను వేసుకోవాలి. మసాలా పైన ఉడికిన బిర్యానీని వేసుకోవాలి. ఇలా రెండు మూడు లేయర్లుగా చేయాలి. ఎల్లో కలర్ చిటికెడు వేసి మూత పెట్టి 20 నిమిశాల వరకు దమ్ పై ఉడికించాలి.
5. ఇక తరువాత మీ రొయ్యల బిర్యానీ రెడీ అయినట్టే. ప్లేటులో సర్వ్ చేసుకొని సలాడ్, పెరుగు, మిర్చి సలాన్ కర్రీతో కలుపుకొని తినేయడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications