Latest Updates
-
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా?
ముల్లంగి సాంబార్..దీని టేస్ట్ అమృతమే..ఎలా చేసుకోవాలంటే
ముల్లంగి సాంబార్ ఒక రుచికరమైన,పోషకమైన దక్షిణ భారతీయ వంటకం. ముల్లంగి తన ప్రత్యేకమైన రుచి, పోషక విలువలతో ఈ సాంబార్ కు ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. ఇది అన్నం, ఇడ్లీ, దోసె,వడ వంటి వివిధ రకాల ఆహారాలతో చాలా బాగుంటుంది. ముల్లంగి సాంబార్ తయారు చేయడం సులభం. దీనిని మీ ఇంట్లో ఈజీగా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ముల్లంగి సాంబార్ తయారీకి కావలసిన పదార్థాలు
-ముల్లంగి - 2
-కంది పప్పు - 1 కప్పు
-ఉల్లిపాయ - 1
-టమాటో - 1
-పచ్చిమిర్చి - 2-3
-సాంబార్ పొడి - 2 టేబుల్ స్పూన్లు
-చింతపండు రసం - 1/2 కప్పు
-బెల్లం - చిన్న ముక్క
-ఆవాలు - 1/2 టీ స్పూన్
-మెంతులు - 1/4 టీ స్పూన్
-ఇంగువ - చిటికెడు
-కరివేపాకు - 1 రెమ్మ
-కొత్తిమీర - కొద్దిగా (తరిగినది)
-నూనె - 2 టేబుల్ స్పూన్లు
-ఉప్పు - రుచికి తగినంత
-పసుపు - 1/4 టీ స్పూన్

తయారీ విధానం
-ముందుగా కంది పప్పును శుభ్రంగా కడిగి తగినంత నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్లో ఉడికించుకుంటే 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి.
-పప్పు మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెదుపుకోవాలి.
-ఒక గిన్నెలో తరిగిన ముల్లంగి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.ఈ మిశ్రమానికి కొద్దిగా నీళ్లు పోసి ముల్లంగి ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి.
-ముల్లంగి ఉడికిన తర్వాత మెదిపిన కంది పప్పును ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
-సాంబార్ పొడి వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి సాంబార్ కావలసిన చిక్కదనకు వచ్చేలా చూసుకోండి.
పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి..ఇడ్లీ, దోస,అన్నం దేంతో తిన్నా కేక..ఎలా చేయాలంటే
-తర్వాత నానబెట్టిన చింతపండు రసం, బెల్లం వేసి బాగా కలపాలి. రుచి చూసి ఉప్పు,బెల్లం సరిచూసుకోండి.
-సాంబార్‌ను మీడియం మంట మీద 5-7 నిమిషాలు మరిగించండి.
-ఇప్పుడు పోపు కోసం ఒక చిన్న బాణలిలో నూనె వేడి చేయండి. నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత ఇంగువ మరియు కరివేపాకు వేసి వేయించండి. ఈ పోపును మరిగుతున్న సాంబార్లో వేసి కలపండి.
-తర్వాత అందులో కొత్తిమీర తరుగు వేసి కలిపి దించేయండి. అంతే టేస్టీ ముల్లంగి సాంబార్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
