Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రాగి మటన్ ఖీమా, అబబబ్బ ఒక్క ముద్ద తింటే జీవితంలో మళ్ళీ మర్చిపోరు, సింపుల్‌గా ఎలా చేసుకోవాలంటే?
రాగి జావా, రాగి బిస్కెట్స్, రాగి రోటి ఇలా ఎన్నో రకాల వంటలను రుచి చేసే ఉంటారు. కానీ మీరెప్పుడైనా రాగి మటన్ ఖీమా ట్రై చేశారా? ఒక్క స్పూన్ ఈ రాగి మటన్ ఖీమా నోట్లో వేసుకుంటే లాలాజలం ఆ ఊరి రావాల్సిందే. ఇప్పుడిప్పుడే మన హైదరాబాద్‌లో దీనికి సంబంధించిన రెస్టారెంట్లు వస్తున్నాయి. రెస్టారెంట్లలో కంటే ముందే, ఈ రాగి మటన్ ఖీమాను ట్రై చేయాలనుకునే వారికోసం రాగి మటన్ ఖీమా ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
మటన్ ఖీమా - 1/2 కిలో
రాగి పిండి - 1/2 కప్పు
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
టమోటాలు - 2 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినది)
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 1 టీస్పూన్
పసుపు - 1/2 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1/2 టీస్పూన్

తయారుచేసే విధానం:
- ముందుగా, మటన్ ఖీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- ఒక పాన్ లో నూనె వేడి చేసి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
- తర్వాత టమోటాలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
- ఇప్పుడు మటన్ ఖీమా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
- కొద్దిగా నీరు పోసి ఖీమాను మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
- ఖీమా ఉడికిన తర్వాత, రాగి పిండిని కొద్దిగా నీటిలో కలిపి పాన్ లో వేసి బాగా కలపాలి.
- కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలిపి, రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రాగి మటన్ ఖీమా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications