Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఎండాకాలంలో తెలుగు లోగిళ్లలో వడియాలు, పచ్చళ్ల సందడి మొదలవుతుంది. మండుతున్న ఎండలను చూస్తే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఎండబెట్టే వడియాలే. అన్నంలోకి నంజుకోవడానికి వడియాలు ఉంటే ఆ భోజనం రుచే వేరు. అందులోనూ సగ్గుబియ్యం, బంగాళాదుంప కలిపి చేసే వడియాలు చాలా కరకరలాడుతూ, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉంటాయి.

పిల్లలు వీటిని పాప్ కార్న్ లాగా ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం పాప్ కార్న్ సైజులో చిన్నచిన్నగా పెట్టడం వల్ల, నూనెలో వేయగానే ఇవి పువ్వుల్లా విచ్చుకుంటాయి. అందుకే వీటిని సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ వడియాలను చాలా సులువుగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు తయారీకి కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం - 1 కప్పు
బంగాళాదుంపలు- 2
పచ్చిమిర్చి - 5
జీలకర్ర - 1 టీస్పూన్
అల్లం - చిన్న ముక్క
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - సుమారు 5 కప్పులు
సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుని నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత సగ్గుబియ్యం మునిగేలా నీళ్లు పోసి రాత్రంతా బాగా నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం బాగా నానితే వడియాలు గుల్లగా వస్తాయి.
-తర్వాత తొక్క తీసేసి బంగాళదుంపలను సన్నగా తురుముకోవాలి.
-నానిన సగ్గబియ్యంలో బంగాళదుంప తురుము వేయండి,ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీస్పూన్ తెల్ల నువ్వులు, 1 టీస్పూన్ జీలకర్ర వేసి, 1 కప్పు నీళ్లు పోసి బాగా కలుపుకొని దీనిని స్టవ్ మీద పెట్టి 2 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. మిశ్రమం జారుగా కాకుండా, పాప్ కార్న్ సైజులో పెట్టుకోవడానికి వీలుగా కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
-వడియాల మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు, డాబా మీద ఒక ప్లాస్టిక్ కవర్ లేదా మందపాటి కాటన్ వస్త్రం ఎండలో పరుచుకోవాలి. లేదా ప్లేట్ లో అయినా సగ్గుబియ్యం మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకొని పాప్ కార్న్ లాగా పెట్టుకోండి. వీటిని ఫ్యాన్ కింద కానీ లేదా ఎండలో కానీ 2 రోజులు బాగా ఎండనివ్వాలి.
-మొదటి రోజు సాయంత్రానికి వడియాలు కవర్ నుండి సులువుగా ఊడి వస్తాయి. వాటిని రివర్స్ చేసి రెండో రోజు ఆరనివ్వాలి. అంతే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు రెడీ.
-పూర్తిగా గలగలా శబ్దం వచ్చేలా ఎండిన తర్వాత, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటాయి.
-తినాలనుకున్నప్పుడు స్టవ్ మీద కడాయిలో నూనె వేడి చేయ్యాలి. కడాయిలో నూనె బాగా వేడయ్యాక, ఈ ఎండిన వడియాలను వేస్తే చాలు, మల్లెపూవుల్లా తెల్లగా రెట్టింపు సైజులో విచ్చుకుంటూ కరకరలాడే పాప్ కార్న్ వడియాలు రెడీ. పప్పు, సాంబార్, రసం అన్నంలోకి ఇవి అద్భుతమైన కాంబినేషన్. స్నాక్స్ లా కూడా తినేయవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications