Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మన ముత్తాతలు ఎక్కువగా ఈ స్వీట్స్ తినేవారట.. అందుకే ఒక్కొక్కరు 10 మందిని దడాదడా..ఎలా చేసుకోవాలంటే
ఇప్పుడైతే అంతా పోష్ కల్చర్ వచ్చేసింది. చాలా మంది పిల్లలు కూడా ఖరీదైన.. ఫ్యాన్సీ ఆహరం తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ మన పూర్వికులు మాత్రం అలా కాదు. ఎప్పటికీ సహజసిద్ధమైన ఆహారాన్ని తీసుకునేవారు. తామే పండించి దానిని తామే తినేవారు. అందుకే వాళ్ళు 80 సంవత్సరాలు దాటినా ఇంకా నడవగలుగుతారు, అలాగే చక్కగా మాట్లాడగలుగుతారు. వారు ఆ కాలంలో ఎక్కువగా తిన్న వంటకాల్లో కుడుములు కూడా ఒకటి. ఎక్కువగా కొర్ల పౌర్ణమి నాడు ఈ కుడుములు చేసుకుంటారు. ఆ రోజుల కుక్కల పండగ అని కూడా చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఆ రోజు కుడుములు చేసి కుక్కలకు నైవేద్యంగా పెడితే మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. అయితే ఇప్పటి కాలంలో చాలా మందికి ఈ కుడుము ఎలా చేసుకోవాలో తెలియదు. అందుకే ఈ స్టోరీలో కుడుములు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఆ కుడుములు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
కుడుములు తయారీకి కావాల్సిన పదార్థాలు..
ఒక కిలో సజ్జలు
అరకిలో బెల్లం
రుచికి సరిపడా ఉప్పు
ఉడకడానికి, పిండి కలుపుకోవడానికి సరిపడా నీళ్లు

కుడుములు తయారీ విధానం..
సజ్జలతో చేసుకునే ఈ కుడుములు అత్యంత సులభంగా చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. ఈ కుడుములు తయారు చేసుకోవడానికి ముందుగా.. సజ్జలను కడుక్కొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ సజ్జలను ఇంట్లో రోకలితో పిండి చేసుకోవాలి. రోకలి లేని వ్యక్తులు మిల్లుకు వెళ్లి కొంచెం మెత్తగా కాకుండా ఉండే విధంగా పిండిని పట్టించుకోవాలి. ఇలా మొత్తం కిలో పిండిని పట్టుకోవాలి.
ఇప్పుడు ఆ పిండిని ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి. అందులో వేడి నీళ్లు కొంచెం కొంచెం కలుపుతూ పిండిని మిక్సీ చేసుకోవాలి. అలాగే ఆ వేడినీళ్ళతో పాటు బెల్లం కరిగించిన నీటిని కూడా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఆ పిండిని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక్కో ముద్దలాగా చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్‌లో మీకు నచ్చినట్టు వాటిని ఒక గారేలాగా చేసుకోవాలి.
చికెన్, మటన్ లేకుండా ఎంప్టీ బిర్యానీ.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఎలా చేసుకోవాలంటే?
ఇప్పుడు ఒక కట్టెపుల్ల తీసుకొని.. మనం చిన్న చిన్న ముద్ద మాదిరిగా చేసుకున్న వాటికి మధ్యలో రంధ్రం చేయాలి. అలా పిండి మొత్తాన్ని చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానికి కింద టేకు ఆకులను వేసుకోవాలి. అలాగే దానికి పైన కొన్ని ఎండిన వరిగడ్డిని వేసుకోవాలి. ఇప్పుడు ఆ గడ్డిపై మనం ఒత్తి పెట్టుకున్న కుడుములు వేసుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కుడుములు సిద్ధమైనట్లే. ఇంత సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి.
కుడుముల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
తేలికగా జీర్ణమవుతాయి: ఆవిరిలో ఉడికించడం వల్ల కుడుములు తేలికగా
జీర్ణమవుతాయి. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
తక్కువ కేలరీలు: నూనెలో వేయించిన ఆహారాలతో పోలిస్తే, ఆవిరిలో
ఉడికించిన కుడుములలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే
వారికి ఇది మంచి ఎంపిక.
గ్లూటెన్ రహితం: బియ్యం పిండి గ్లూటెన్ రహితమైనది కాబట్టి, గ్లూటెన్
అసహనం ఉన్నవారికి ఇది సురక్షితమైన ఆహారం.
శక్తినిస్తాయి: బియ్యం పిండి కార్బోహైడ్రేట్ల యొక్క మంచి మూలం, ఇది
శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications