Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతుంది..షీర్ కుర్మా ఇలా చేసుకోండి
సాధారణంగా రంజాన్ లేదా ఈద్ సమయంలో ఎక్కువగా షీర్ కుర్మా చేస్తుంటారు. ఈ పండుగల సమయంలో అందరి ముస్లింల ఇళ్లల్లో మాత్రమే కాకుండా రెస్టారెంట్స్ లో కూడా స్పెషల్ గా దీన్ని తయారుచేసి వడ్డిస్తారు. ఈ షీర్ కుర్మా నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతుంది. దీని టేస్ట్ మరేఇతర పాయసానికి రాదంటే ఆశ్చర్యం లేదు. కొంతమంది అయితే షీర్ కుర్మా తినడానికే పుట్టాం అని కూడా సరదాగా అంటుంటారు. అయితే ఈ షీర్ కుర్మాని ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలి,దీనిని చేయడానికి ఏమేం పదార్థాలు కావాలో ఇక్కడ చూడండి.
షీర్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు
-పాలు 1 లీటర్
-ఎండు ద్రాక్షలు 7
-బాదంపప్పు 10
-జీడిపప్పుు 10
-పిస్తా పప్పులు 15
-నెయ్యి 6 టేబుల్ స్పూన్లు
-చిరోంజి పప్పు 2 టేబుల్ స్పూన్లు
-పంచదార 250 గ్రాములు
-కండెన్స్డ్ మిల్క్ 300 ml
-సేవియా 1 కప్పు
షీర్ కుర్మా తయారీ విధానం
-ముందుగా విడి విడిగా ఎండుద్రాక్ష, జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా పప్పుని రాత్రంతా నానబెట్టుకోండి.
-తర్వాత నానబెట్టిన ఎండు ఖర్జూరంలోని గింజలు తీసేసి పొడవుగా ఖర్చూరాన్ని చీరుకోవాలి. జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాదంపప్పు చెక్కు తీసేసి సన్నగా తరుగుకోవాలి. పిస్తా పప్పులను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఇప్పుడు పాన్ లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి అందులో కట్ చేసిన ఈ ముక్కలన్నింటిని వేసేయండి. ఇందులోనే చిరోంజి పప్పు కూడా వేసి బాగా వేపి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు పాన్ లో మరో 3 కప్పుల నెయ్యి వేడి చేసి అందులో 1కప్పు సేవియా(saviya) వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే దాకా వేయించి పక్కనపెట్టుకోండి
-తర్వాత అడుగు మందంగా ఉండే గిన్నెలో 1 లీటర్ పాలు మరిగించుకోవాలి.
-పాలు కొంచెం మరిగాక అందులో 300 ఎమ్ఎల్ కండెన్స్డ్ మిల్క్ లేదా పావు కేజీ పంచదార వేసి కలపండి. తర్వాత ఇందులోనే ఎండుద్రాక్ష వేసి బాగా కలపండి.
-5 నిమిషాల పాటు మరిగిన తర్వాత అందులో ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు, బాదం,పిస్తా,చిరోంజి పప్పులను వేసి మొత్తం బాగా కలపాలి.
-తర్వాత ఇందులోనే ఫ్రై చేసిన సేవియా, అర టీస్పూన్ ఏలకల పొడి వేసి కలపండి. తక్కువ మంట మీద 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక పొంగు రాగానే దించేయండి. అంతే షీర్ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








