Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
సూపర్ టేస్టీ సగ్గు బియ్యం వడియాలు.. డబుల్ రుచి, నోట్లో వేసుకునే బ్లాస్టే! సింపుల్ అండ్ రుచిగా చేసుకునే విధానం
వేసవి కాలం అంటేనే ఇంట్లో రకరకాల వంటకాలు చేసుకుంటూ ఉంటాం. ఇంటి ప్రాంగణంలో రంగురంగుల ప్లాస్టిక్ షీట్లు, చీరలపై వేసిన వడియాలతో అందంగా అలంకరించి కనిపిస్తూ ఉంటాయి. వేడికి వడియాలు బాగా ఆరడంతో పాటు.. చాలా రుచిగా కూడా తయారువుతాయి. అలాగే ఈ కాలంలోనే వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. అలాంటి వడియాల్లో ఒకటి సగ్గు బియ్యం వడియాలు. ఇవి చాలా ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. అలాగే అద్భుతమైన రుచితో కూడా ఉంటాయి. చాలా మందికి ఫెవరెట్ స్నాక్ ఇది. దీనిని చేసుకోవడం చాలా సులభం. అలాగే ఎక్కువ రోజులు ఉంచుకోవడం కూడా ఈజీ. అది ఎలానో ఇక్కడ తెలుసుకుందాం.
సగ్గు బియ్యం వడియాలు తయారీకి అవసరమైన పదార్థాలు:
సగ్గుబియ్యం (సన్న) - 1 కప్పు
నీళ్లు - సుమారు 8 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చిమిర్చి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - ½ టీస్పూన్
ఇంగువ - ¼ టీస్పూన్ (ఐచ్ఛికం)

సగ్గు బియ్యం తయారీ విధానం:
ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు కడిగి పెట్టుకున్న సగ్గు బియ్యంలో రెండు కప్పుల నీరు పోసుకొని.. వాటిని రాత్రంతా నానబెట్టాలి.
పొద్దున్నే నానిన సగ్గుబియ్యాన్ని ఒక లోతైన పాత్రలో వేసి, మిగిలిన 6 కప్పుల నీటిని జత చేసి మెల్లగా మరిగించాలి. ఇలా చేస్తేనే సరిగ్గా వస్తుంది. అలాగే రుచి కూడా బాగుంటుంది.
ఇది మరిగే సమయంలో, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, జీలకర్ర, ఇంగువ వంటి మసాలాలను చేర్చాలి.
పల్లెటూరి ఫేమస్.. ఎండు మటన్ కూర, తక్కువ మాసాలతో ఇలా చేసుకుంటే కమ్మగా ఉంటుంది
ఈ మిశ్రమాన్ని 15-20 నిమిషాలు మధ్యమమైన మంటపై ఉడికించాలి. సగ్గుబియ్యం జిగురుగా మారేంత వరకు కలుపుతూ ఉండాలి.
మిశ్రమం చిక్కటి ముద్దలా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వదిలేయాలి.
ప్లాస్టిక్ షీట్ లేదా సుద్దబట్టను తీసుకుని, పైకి కొద్దిగా నూనె రాసి తయారైన మిశ్రమాన్ని స్పూన్‌తో గుళికలుగా వేసుకోవాలి.
వడియాలు అతుక్కోకుండా దూరంగా వేసుకోవాలి.
ఎండలలో రెండు రోజులు ఆరబెట్టితే ఇవి బాగా గట్టిగా మారుతాయి.
పూర్తిగా ఎండిన వడియాలను ఎయిర్‌టైట్ డబ్బాలో నిల్వ చేస్తే ఏడాది రోజుల వరకూ నాసిరకం కాకుండా ఉండిపోతాయి. అలాగే వాటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు.
మసాలా ఇడ్లీ ఫ్రై..ఇడ్లీ అంటేనే మొఖం తిప్పేసుకునేటోళ్లు కూడా ప్లేట్ పట్టుకొని ఎగబడతారు..ఎలా చేయాలంటే
ఎప్పుడు వేయించాలి?
వర్షాకాలం, చలికాలంలో వడియాలను వేయించి తింటే అద్భుతంగా ఉంటుంది. భోజనానికి రుచి జోడించటమే కాదు, కడుపునిండా సంతృప్తినిస్తుంది. స్నాక్స్‌గా కావాలంటే కూడా ఇవి ఉపయోగించుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టపడతారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications