Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
మార్వాడీ స్టైల్ పాలక్ పనీర్ కూరను ఇలా ఎప్పుడైనా వండుకున్నారా..?
పనీర్‌తో ఏ కర్రీ చేసుకున్నా చాలా రుచిగా వుంటుంది. పనీర్ బటర్ మసాలా, పాలక్ పనీర్, పనీర్ దోశ, పనీర్ బిర్యానీ ఇలా ఏ ఐటం అయినా నోరూ ఊరించేస్తుంది. నార్త్ ఇండియాలో ఎక్కువగా తినే ఈ వంటలను ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా ఫేమస్ అయ్యాయ్. ఒకప్పుడు తెలుగు పెళ్లిల్లు, ఫంక్షన్లలో పాలకూర పప్పు, వంకాయ మసాలా ప్రధానంగా వుండేవి, కానీ వాటి స్థానంలో ఇప్పు పనీర్ కర్రీ కూడా వచ్చి చేరింది. పనీర్ కూరను ఒక్కసారి తింటే ఇష్టపడని వారు వుండరు. పనీర్‌తో టేస్ట్ మాత్రమే కాదు పోషకాలు కూడా బాగా అందుతాయ్. పనీర్‌లో ప్రొటీన్లు పుష్కలంగా వుంటాయ్. ఈ రోజు మీకు పాలక్ పనీర్ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాం. ఈ పాలక్ పనీర్ రెసిపీని సింపుల్‌గా ఈజీగా చేసుకోవచ్చు.
పాలక్ పనీర్ తయారు చేయడానికి కావాల్సిన వంట సామాగ్రి
మంచినూనె, పాలకూర, ఉల్లిపాయలు, టమాటలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, కాజూలు, నెయ్యి, జిలకర, బిర్యానీ ఆకులు, పసుపు, ధనియాల పొడి, కారంపొడి, ఉప్పు, పనీర్, కసూరి మేతి పొడి.

పాలక్ పనీర్ తయారు చేసుకునే విధానం
1. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్‌పైన పెట్టుకొని దాంట్లో ఒక టీ స్పూన్ మంచినూనెను వేసి ప్యాన్‌ను మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు కప్పుల పాలకూరను బాగా కడిగి ప్యాన్‌లో వేసుకోవాలి. మూతపెట్టి రెండు నుంచి మూడు నిమిశాలు ప్యాన్‌లో ఈ పాలకూరను బాగా ఉడికించాలి. ఇక ప్యాన్‌ను కిందకు దించుకోవాలి.
2. తరువాత ఒక మిక్సీజార్‌లోకి రెండు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి. రెండు టమాటాలను, నాలుగు పచ్చిమిరపకాయలను, పొట్టుతీసిన 4 వెల్లుల్లి ముక్కలను, అల్లం ముక్కలను, యాడ్ చేసుకొని మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాను మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి.
3. ఇంతకు ముందు ఉడికించిన పాలకూరను మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. 6 కాజూలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

4. ఒక ప్యాన్‌ను తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల మంచి నూనెను, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయిన తరువాత అరటీస్పూన్ జిలకరను వేసుకోవాలి. రెండు బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఉల్లిపాయ, టమాట పేస్ట్‌ను కూడా ప్యాన్‌లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన మొత్తం పోయిన, నీళ్లు ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు ప్యాన్‌లో పావు టీస్పూన్ పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పాలకూర పేస్ట్‌ను కూడా యాడ్ చేసుకోవలి. పాలకూర మాడిపోకుండా వుండాలంటే పావుకప్పు నీళ్లను పోసుకొని ప్యాన్‌లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అర టీస్పూన్ గరం మసాలా రెండు టీ స్పూన్ల ధనియాల పొడిని, ఒక టీ స్పూన్ కారంపొడిని వేసి కలపాలి. తగినంత ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి.
6. గ్రేవీ కూడా కావాలి కాబట్టి ముప్పావు నీళ్లను ప్యాన్‌లో పోసుకొని బాగా కలుపుకోవాలి. ప్యాన్‌పై మూత పోట్టి 4 నిమిశాల వరకు బాగా ఉడికించాలి. ఉడికిన పాలకూరలో 200ల గ్రాముల పనీర్‌ను వేసుకొని కలపాలి. ఇప్పుడు దీన్ని మరో 4 నిమిశాలు మూత పెట్టి ఉడికించాలి.
7. మూత తీసిన తరువాత ఒక టీస్పూన్ కసూరి మేతి పొడిని కూరలో యాడ్ చేసుకోవాలి. ఇక దీంతో టస్టీ పాలక్ పనీర్ రెడీ అయినట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications