For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Telangana Garelu: కరకరలాడే తెలంగాణ గారెలు

సంక్రాంతికి మూడు, నాలుగు రోజుల ముందు నుండి ప్రతి ఇంట్లో గారెల తయారీ మొదలు అవుతుంది. కరకరలాడే గారెలు అంటే చాలా మందికి ఇష్టం. సంక్రాంతి రోజున నాన్ వెజ్‌లో గారెలు వేసుకుని తింటే గాని సంక్రాంతిలా అనిపించదు.

Posted By:
|

Telangana Garelu: 'వింటే భారతమే వినాలి.. తింటే గారెలే తినాలి' మరికొన్ని రోజుల్లో సంక్రాంతి వచ్చేస్తోంది. ఈ సంక్రాంతికి ప్రతి ఇంటి ముందు రంగవల్లులు ఎంతలా కనిపిస్తాయో.. ఇంట్లో గారెల కరకర శబ్ధాలు అంతలా వినిపిస్తాయి.

సంక్రాంతికి మూడు, నాలుగు రోజుల ముందు నుండి ప్రతి ఇంట్లో గారెల తయారీ మొదలు అవుతుంది. కరకరలాడే గారెలు అంటే చాలా మందికి ఇష్టం. సంక్రాంతి రోజున నాన్ వెజ్‌లో గారెలు వేసుకుని తింటే గాని సంక్రాంతిలా అనిపించదు.

మరి టేస్టీగా కరకరలాడే గారెలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

గారెల తయారీకి కావాల్సిన పదార్థాలు:

1. బియ్యం పిండి

2. జీలకర్ర

3. నువ్వులు

4. పల్లీలు

5. ధనియాలు

6. కారం

7. ఉప్పు

8. పసుపు

9. కరివేపాకు

10. పాలిథీన్ కవర్

గారెల తయారీ విధానం:

1. ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకోవాలి.

2. బియ్యం పిండిలో కొద్దిగా జీలకర్ర, నువ్వులు, పల్లీలు, ధనియాలు వేసుకోవాలి.

3. ముందుగా 3 గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్న శెనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి.

4. కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, కరివేపాకు వేసుకోవాలి.

5. బియ్యం పిండిలో అన్నీ సరిగ్గా కలిసేలా చక్కగా కలుపుకోవాలి.

6. ఆ మిశ్రమంలో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుతూ ఉండాలి. ఎంత చక్కగా కలిపితే గారెలు అంత బాగా వస్తాయి.

7. మనకు కావాల్సిన సైజులో పిండితో బాల్స్ చేసుకోవాలి.

8. ఒక పాలిథీన్ కవర్ తీసుకుని దానికి నూనె రాయాలి.

9. ఆ కవర్‌ను గారెల మెషీన్‌లో పెట్టుకుని ఆ కవర్ మధ్యలో పిండి ముద్ద పెట్టుకుని వత్తుకోవాలి.

10. గారెల మెషీన్ లేని వాళ్లు చెంబుతో వత్తుకుంటూ గారెలు చేసుకోవచ్చు.

11. తర్వాత ఆ గారెలను పాలిథీన్ కవర్ నుండి చక్కగా తీసి వాటిని ఓ కాటన్ క్లాత్‌పై వేసుకోవాలి.

12. కడాయిలో నూనె పోసుకుని బాగా వేడెక్కే వరకు చూడాలి. తర్వాత వత్తి పక్కన పెట్టుకున్న గారెలను ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేస్తూ కాల్చుకోవాలి.

13. రెండు వైపులా మంచి రంగు వచ్చేంతు వరకు వేయించాలి.

14. తర్వాత వాటిని దించేసుకుంటే కరకరలాడే గారెలు సిద్ధం అయినట్లే.

[ of 5 - Users]
Read more about: recipe వంటకం
English summary

How to make telangana garelu chekkalu in Telugu

read on to know How to make telangana garelu chekkalu in Telugu
Story first published: Wednesday, December 7, 2022, 17:00 [IST]
Desktop Bottom Promotion