Latest Updates
-
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
తోటకూర లివర్ ఫ్రై.. ఇప్పటి వరకు ఇది మీరు తిని ఉండరు.. రుచి వేరే లెవెల్, ఎలా చేసుకోవాలంటే?
లివర్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. చికెన్ లేదా మటన్ షాప్‌కు వెళ్లిన్నప్పుడు అడిగి మరీ లివర్ వేయించుకుంటారు. ఆ లివర్లతో చేసే ఫ్రై ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చేసి అక్కడ పెడితే లొట్టలేసుకుని మరీ తింటారు. లివర్ ఫ్రై కేవలం చికెన్ లేదా మటన్ లివర్‌తో మాత్రమే కాదు.. వెజ్ లవర్స్‌కు ఇష్టమైన రీతిలో తోటకూరతో కూడా చేసుకోవచ్చు. ఏంటి తోటకూరతో లివర్ ఫ్రై ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవును మీరు చదివింది నిజమే. తోటకూరతో లివర్ ఫ్రై అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే వెజ్ ప్రియులు ఉన్నారో వారు దీనిని తప్పకుండా ట్రై చేయొచ్చు. కాకపోతే చాలా మందికి ఇది ఎలా చేసుకోవాలో తెలియదు. అందుకే ఈ స్టోరీలో తోటకూరతో లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
రెసిపీ కోసం కొన్ని ముఖ్యమైన టిప్స్: ఈ వంటకం తీయగా తయారుచేయాలంటే కొన్ని ముఖ్యమైన చిట్కాలు తెలుసుకోవాలి. మొదటిగా, మీరు తీసుకునే తోటకూర ముదురు కాకుండా కొంచెం లేతదిగా తీసుకోవాలి. అదంతా ముదురు అయితే, లివర్ ఫ్రై రెసిపీకి మంచి రుచి రాదు. అలాగే మిశ్రమాన్ని ఉడికించడానికి తీసుకునే బౌల్ 1 ఇంచు మందంగా ఉండేలా చూసుకోండి. అలా కాకపోతే, అది దురుసుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్రై చేసే పేస్ట్ సన్నగా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోడానికి ఫోర్క్‌తో గుచ్చి చూడండి.

లివర్ తయారికి కావాల్సిన పదార్థాలు:
మూడు పచ్చిమిర్చి
ఆరు కట్టలు తోటకూర
అర కప్పు శనగపిండి
ఒకటిన్నర టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్
అరటీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్
కొద్దిగా ఉప్పు
2 చిటికెళ్లు పసుపు
పావు టీస్పూన్ గరంమసాలా
పావు టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి
తయారీ విధానం:
మొదటగా, ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించండి.
నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో పచ్చిమిర్చి మరియు లేత తోటకూరను
కాడలతో సహా వేసి 5 నిమిషాలపాటు హై ఫ్లేమ్‌లో ఉడికించండి.
తోటకూర ఉడికిన తర్వాత, అది బౌల్లో తీసుకుని చల్లటి నీళ్లు
పోసి, మంచి పేస్ట్‌గా మిక్సీలో వేసి గట్టిగా పేస్ట్
చేసుకోండి.
ఇప్పుడు, శనగపిండి, కార్న్ ఫ్లోర్, అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు,
ఉప్పు, గరంమసాలా, జీలకర్ర పొడిని పేస్ట్‌లో కలపాలి.
మిశ్రమం చక్కగా కలిసిన తర్వాత, కేక్ మౌల్డ్ లేదా గిన్నె తీసుకుని బటర్
పేపర్ వేసి, అందులో ఈ మిశ్రమాన్ని సమానంగా ప్లాట్ చేసి పెట్టాలి.
తర్వాత కుక్కర్లో కొంత నీళ్లు పోసి, స్టాండ్‌పై
గిన్నె పెట్టి, మూత పెట్టి 8 నిమిషాలు హై ఫ్లేమ్‌లో, 4
నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించాలి.
స్టౌ ఆఫ్ చేసి 10 నిమిషాలు అలా వదిలేయండి.
చల్లారిన తర్వాత, గిన్నె నుంచి డీమౌల్డ్ చేసి చిన్న
క్యూబ్స్‌గా కట్ చేయండి.
ఫ్రై తయారీ కోసం కావాల్సిన పదార్థాలు:
½ కప్పు నూనె
అరటీస్పూన్ జీలకర్ర
మూడు పచ్చిమిర్చి
ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు
కొద్దిగా కరివేపాకు
అరటీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్
ఒక టేబుల్ స్పూన్ కారం
పావు టీస్పూన్ గరంమసాలా
చిటికెడు పసుపు
ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి
రెండు టమాటాలు
కొద్దిగా కొత్తిమీర తరుగు
ఫ్రై తయారీ విధానం:
పాన్‌లో నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక, ముందుగా
వేయించిన లివర్ ముక్కలను వేయించి, 7-8 నిమిషాలపాటు క్రిస్పీగా
వేయించండి.
వేయించిన లివర్‌ను ఒక ప్లేట్లో తీసి పెట్టండి.
మిగిలిన నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేసి
ఉల్లిపాయల నైసర్గిక బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి, వాసన పోయే వరకు వేయించండి.
తర్వాత, కారం, ధనియాల పొడి, పసుపు, గరంమసాలా వేసి బాగా వేయించండి.
ఇప్పుడు, టమాటా ప్యూరీ వేసి, ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్
చేయండి.
అరకప్పు నీళ్లు పోసి, వేయించిన లివర్ ముక్కలు, కొత్తిమీరను వేసి
నెమ్మదిగా కలిపి మూత పెట్టి 5-7 నిమిషాలు ఉడికించండి.
చివరగా, గరంమసాలా, కొత్తిమీర తరుగు వేసి, మిశ్రమాన్ని కలిపి
దింపేసుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications