Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రపంచంలోనే నెం.2 బెస్ట్ స్వీట్ ఇదే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
రసమలై ఒక ప్రసిద్ధ భారతీయ తీపి వంటకం. పాలు, చక్కెర, కుంకుమపువ్వు, పన్నీర్, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వంటి పదార్థాలతో దీనిని తయారుచేస్తారు. దీన్ని తినడం వల్ల అందే పోషకాలు కూడా అధికమే. రసమలై తయారీలో అధికంగా వాడేది పాలే కాబట్టి పాలలోని సుగుణాలన్నీ ఈ స్వీటులో కూడా ఉంటాయి. కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. ఈ రుచికరమైన, నోరూరించే తీపి వంటకాన్ని సాధారణంగా పండుగలు, ప్రత్యేక సందర్భాలలో తయారుచేస్తారు.
గతేడాది ప్రముఖ ట్రావెల్, ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రకటించిన వరల్డ్ బెస్ట్ చీజ్ డెజెర్ట్స్ జాబితాలో రసమలైకి వరల్డ్ నెంబర్ 2 పొజిషన్ దక్కింది. ఎక్కువ మంది ఇష్టపడే స్వీట్ ఐటమ్స్ లో ఒకటైన రసమలైని ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

రసమలై తయారీకి కావలసిన పదార్థాలు
పన్నీర్: 200 గ్రాములు
పాలు: 1 లీటరు
చక్కెర: 1 కప్పు
కుంకుమపువ్వు: చిటికెడు
యాలకుల పొడి: 1/2 టీస్పూన్
పిస్తా, బాదం: గార్నిష్ కోసం
నాన్ వెజ్ కర్రీలకు ధీటుగా..దాభా స్టైల్ లో పసందైన పన్నీరు కర్రీ,ఎలా చేయాలంటే
రసమలై తయారీ విధానం
-రసమలై తయారీ కోసం మొదటగా మొదటగా పన్నీర్ తయారుచేయాలి. ఇందుకోసం పాలను బాగా మరిగించి అందులో నిమ్మరసం లేదా వెనిగర్ వేసి పాలను విరగ్గొట్టాలి.
-విరిగిన పాలను ఒక పలుచని వస్త్రంలో వడకట్టి నీటిని పూర్తిగా తీసివేయాలి.
-పన్నీరును మెత్తగా పిండి, ఉండలు లేకుండా బాగా కలపాలి.
-తయారుచేసిన పన్నీర్ ను చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
-ఈ ఉండలను అరచేతిలో పెట్టి మెల్లగా నొక్కి కొంచెం చదునుగా చేయాలి.
-ఇప్పుడు చక్కెర పాకం తయారుచేయాలి. ఇందుకోసం ఒక గిన్నెలో చక్కెర, 1 కప్పు నీరు వేసి మరిగించాలి. చక్కెర పూర్తిగా కరిగి, పాకం కొంచెం చిక్కబడే వరకు మరిగించాలి.
-మరిగే చక్కెర పాకంలో పన్నీర్ బాల్స్ వేసి 5-7 నిమిషాలు ఉడికించాలి.
-బాల్స్ పరిమాణం రెట్టింపు అయ్యే వరకు ఉడికించాలి.
-ఉడికిన రసమలై బాల్స్ ను చక్కెర పాకం నుండి తీసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో పాలు పోసి సగం అయ్యే వరకు మరిగించాలి.
-మరిగే పాలల్లో కుంకుమపువ్వు, యాలకుల పొడి, కొద్దిగా చక్కెర వేసి కలపాలి. పాలు చిక్కబడే వరకు మరిగించాలి.
-మరిగించిన పాలల్లో పన్నీర్ బాల్స్ వేసి కొన్ని నిమిషాలు నానబెట్టాలి.
-రసమలైని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పిస్తా, బాదంతో గార్నిష్ చేయాలి. అంతే రసమలై రెడీ. మీ రుచికి అనుగుణంగా చక్కెర, డ్రై ఫ్రూట్స్ ను మార్చుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications