Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Vadamala: హనుమంతుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం.. ఇది సమర్పిస్తే హనుమంతుడి అనుగ్రహం మీపైనే! ఎలా చేసుకోవాలంటే?
దేశమంతటా ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి జరుపుకుంటారు. హిందూ భక్తులకు ఎంతో ఇష్టమైన ఈ పండగను భక్తులు ఎంతో ఉత్సాహంగా, భక్తితో జరుపుకుంటున్నారు. ఆలయాల్లోనూ, ఇంటిల్లోనూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆంజనేయస్వామిని స్మరించుకుంటున్నారు. ఈ పవిత్ర రోజున హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం ద్వారా ఆయన అనుగ్రహం చేకూరుతుందని భక్తుల నమ్మకం.
హనుమంతుడిని పూజించేప్పుడు ఆయనకు అత్యంత ప్రీతికరమైన ప్రసాదంగా వడమాలను పెడుతుంటారు. హనుమంతుడికి సమర్పించే నైవేద్యాల్లో ఈ వడమాల అత్యంత ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి తమిళనాడులో "ఆంజనేయ వడ" లేదా "వడమాల" అన్న పేర్లతో ప్రసిద్ధి గాంచిన ఈ ప్రసాదం, హనుమాన్ జయంతి రోజున శ్రద్ధగా తయారు చేసి స్వామికి సమర్పిస్తారు. ఇప్పుడు ఈ వడలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

ఆంజనేయ వడమాల తయారీకి కావలసిన పదార్థాలు:
మినపప్పు - 1 కప్పు
మిరియాలు - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి అనుగుణంగా
ఇంగువ - ¼ టీస్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు (పిండిలో కలిపేందుకు)
డీప్ ఫ్రైకి అవసరమైన నూనె
ఘుమఘుమలాడే కాశ్మీరీ చికెన్ మసాలా.. ఇది తింటే బట్టర్ చికెన్ మర్చిపోతారు, ఇంట్లోనే చేసుకునే విధానం ఇదే
ఆంజనేయ స్వామికి ఇష్టమైన వడమాల తయారీ విధానం:
ఈ వడమాలను తయారు చేసుకోవడానికి ముందుగా మినపప్పును 20 నిమిషాలపాటు నీటిలో నానబెట్టాలి. దీన్ని ఎక్కువసేపు నానబెట్టకూడదు. అప్పుడది నీరుగా మారి వడలు మెత్తబడి పోతాయి. అందుకే కొంచెంసేపు మాత్రమే వీటిని నానబెట్టుకోవాలి.
నానిన పప్పును నీరు లేకుండా వడకట్టి ఒకవైపు పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో మిరియాలు, జీలకర్ర, ఉప్పుతో పాటు పప్పును వేసి చక్కగా గ్రైండ్ చేయాలి. నీరు వేసే అవసరం లేదు. వేయరాదు కూడా.
పిండిని ఒక బౌల్‌లోకి తీసుకుని, అందులో వేడి నూనె మరియు ఇంగువ వేసి బాగా కలపాలి. పిండి గట్టిగా ఉండాలి, చపాతీ పిండి లాగా సానగా ఉండేలా చూడాలి.
ఒక తడి కాటన్ బట్టను తీసుకుని దానిపై పిండిని చిన్న చిన్న గుండ్రని ముద్దలుగా పెట్టాలి. ప్రతి వడకి మధ్యలో చిన్న రంధ్రం చేయాలి.
ఈ విధంగా తయారుచేసిన వడలను 5-10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. వెంటనే వేయించేస్తే అవి బాగా పొంగిపోవచ్చు.
ఇప్పుడు నూనె వేడి చేసి, వడలను దీంట్లో వేసి మీడియం మంటపై వేయించాలి. మొదట వడలను సగం వేయించి, తర్వాత మళ్లీ రెండు సార్లు వేయించడం వల్ల అవి కరకరలాడేలా, బాగా బంగారు రంగు రావడంతో పాటు, నోటికి రుచిగా మారతాయి.
ప్రత్యేక సూచన:
ఈ వడలను మాలలుగా తీర్చిదిద్దుకుని, హనుమంతుడి విగ్రహానికి అలంకరించి సమర్పిస్తే, అది అత్యంత పవిత్రమైన నైవేద్యంగా పరిగణించబడుతుంది. భక్తిపూర్వకంగా సమర్పించిన ప్రతి వడ కూడా, భక్తుడి మనసులోని శ్రద్ధకు ప్రతిరూపంగా మారుతుంది. ఈ హనుమాన్ జయంతి రోజు, స్వయంగా శ్రద్ధతో ఆంజనేయ వడలు తయారు చేసి, ఆంజనేయ స్వామికి సమర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందండి. ఆరోగ్యం, ధైర్యం, విజయం మీవే కావాలని హనుమంతుడిని ప్రార్థిద్దాం. జై హనుమాన్!
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications