Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మన శ్రీదేవి డాటర్ ఫేవరెట్ రెసిపి..దహీ తడ్కాని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి
దహీ తడ్కా అనేది భారతీయ వంటకాల్లో చాలా తేలికైన, త్వరగా తయారు చేసుకోగలిగే ఒక రుచికరమైన వంటకం. ఇది సాధారణంగా అన్నం లేదా రోటీతో సైడ్ డిష్‌గా వడ్డిస్తారు. దీన్ని తయారు చేయడం చాలా సులభం. దీనికి కావాల్సిన పదార్థాలు ఇంట్లో అందుబాటులో ఉంటాయి. దీనిని సెలబ్రిటీ రెసిపి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీలు ఇష్టంగా తినే వంటకం ఇది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ కి అయితే ఇది చాలా ఫేవరెట్ రెసిపి. దహీ తడ్కాని మీ ఇంట్లొనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలొ ఇప్పుడు చూద్దాం.
దహీ తడ్కా తయారీకి కావలసిన పదార్థాలు
-పెరుగు: 1 కప్పు
-నెయ్యి: 1-2 టేబుల్ స్పూన్లు
-ఆవాలు: 1 టీస్పూన్
-జీలకర్ర: 1 టీస్పూన్
-ఇంగువ: చిటికెడు
-ఎండుమిర్చి: 1-2
-కరివేపాకు: 8-10 ఆకులు
-పచ్చిమిర్చి: 1
-అల్లం తురుము: 1/2 టీస్పూన్
-వెల్లుల్లి: 3-4 రెబ్బలు
-ఉల్లిపాయ: 1 చిన్నది
-పసుపు: 1/4 టీస్పూన్
-కారం: 1/2 టీస్పూన్
-ధనియాల పొడి: 1/2 టీస్పూన్
-ఉప్పు: తగినంత
--కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో పుల్లగా లేని, చిక్కటి పెరుగును తీసుకోండి. దీన్ని గడ్డలు లేకుండా మెత్తగా అయ్యే వరకు బాగా చిలకాలి. మీకు కొంచెం పల్చగా కావాలంటే పావు కప్పు నుండి అర కప్పు నీళ్లు కలుపుకోవచ్చు. ఉప్పును తగినంత కలుపుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక చిన్న కడాయి లో నెయ్యి వేసి మీడియం మంటపై వేడి చేసి ఇందులో ఆవాలు వేసి అవి చిటపటలాడే వరకు వేయించండి. ఆ తర్వాత, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి వేసి కొన్ని సెకన్లు వేయించండి.
-ఇప్పుడు తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వెల్లుల్లి లేత గోధుమ రంగులోకి మారే వరకు వేయించండి. మీరు ఉల్లిపాయలు వేయాలనుకుంటే ఈ దశలో తరిగిన ఉల్లిపాయలు వేసి అవి రంగు మారే వరకు వేయించండి.
-మంటను తగ్గించి పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపండి. మసాలా దినుసులు మాడిపోకుండా చూసుకోండి. మసాలా దినుసులు వేసిన వెంటనే మంటను ఆపివేయడం చాలా ముఖ్యం.
-తడ్కా మిశ్రమం కొద్దిగా చల్లబడిన తర్వాత చిలికిన పెరుగులో నెమ్మదిగా పోసి పూర్తిగా కలిసేలా బాగా క'rలపండి. రుచి చూసి అవసరమైతే మరికొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు.
-సన్నగా తరిగిన కొత్తిమీర అందులో చల్లుకొని కలపండి. అంతే దహీ తడ్కా రెడీ.
-దహీ తడ్కా రుచిగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పెరుగు, తడ్కాలో వాడే సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







