కొబ్బరి లడ్డూ..

కొబ్బరి లడ్డూ..

కావాల్సినవి : కొబ్బరికాయ-1

పాలు - ఒక లీటరు

బొంబాయి రవ్వ - అరకప్పు

చక్కెర - తగినంత

యాలకుల పొడి కొద్దిగా..

నెయ్యి - తగినంత

తయారీ విధానం..

తయారీ విధానం..

ముందుగా కొబ్బరికాయను నీటిగా పగులగొట్టి దాని యొక్క తురుము తీసుకుని పక్కనపెట్టుకోవాలి. బొంబాయి రవ్వలో కొద్దిగా నెయ్యి వేసి వేయించుకోవాలి. ఒక పాత్రలో నీరు కలపని పచ్చిపాలు, కొబ్బరి తురుము, చక్కెరను వేసి మరగనివ్వాలి. ఆ మిశ్రమం చిక్కబడే సమయంలో బొంబాయి రవ్వ, యాలకుల పౌడర్ ను వేసి బాగా కలపాలి. కొన్ని నిమిషాల తర్వాత ఆ పాత్రను గ్యాస్ మీద నుండి తీసి చల్లారిన తర్వాత లడ్డూలుగా తయారు చేసుకుంటే సరిపోతుంది.

శనగపప్పు పాయసం..

శనగపప్పు పాయసం..

కావాల్సినవి : శనగపప్పు - ఒక కప్పు, బెల్లం పౌడర్ - తగినంత, పాలు-ఒక కప్పు, నెయ్యి-టేబుల్ స్పూన్, యాలకుల పౌడర్-తగినంత, కాజు, బాదంపప్పు - కొంచెం

Krishna Janmashtami 2020 : శ్రీకృష్ణుడు జన్మించిన రోజునే కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారంటే...

తయారీ విధానం..

తయారీ విధానం..

కుక్కర్లో ఒకటికన్నర కప్పు నీరు వేసి, దానిలో శనగపప్పు వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. ఈలోపు బెల్లం పాకం సిద్ధం చేసుకోవాలి. దీని కోసం పాత్రలో పావు కప్పు నీరు పోసి గ్యాస్ స్టవ్ పై పెట్టాలి. దీనిలో బెల్లం, కొబ్బరి తురుము వేసి సన్నని మంటపై నీరు ఇంకేదాకా మరగించాలి.

అటుకులు, బెల్లం లడ్డు

అటుకులు, బెల్లం లడ్డు

కావాల్సినవి : రెండు కప్పుల అటుకులు, అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు, అరకప్పు పల్లిలు, ఒక కప్పు బెల్లం పౌడర్, వేడిపాలు తగినంత

తయారీ విధానం..

తయారీ విధానం..

అటుకులు, కొబ్బరిముక్కలు, పల్లిలను వేర్వేరుగా తీసుకుని మిక్సీలో వేసి మెత్తటి పొడిగా తయారు చేసుకోవాలి. ఓ పాత్రలో వీటన్నింటినీ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బెల్లం పొడి వేసి బాగా కలపాలి. అదే మిశ్రమంలో కొంచెం పాలు వేసి కలుపుతూ గుండ్రంగా ఉండే ఉండల్లాగా చేసుకోవాలి.

[ of 5 - Users]
Read more about: recipe janmashtami janmashtami 2020 riutals రెసిపి జన్మాష్టమి జన్మాష్టమి 2020 ఆచారాలు
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X