Latest Updates
-
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
Krishna Janmashtami 2020 : శ్రీకృష్ణుడు జన్మించిన రోజునే కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారంటే...
శ్రీకృష్ణుని పుట్టుక గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
పురాణాల ప్రకారం.. భూమి మీద ఎప్పుడైతే అధర్మం.. అరాచకాలు పెరిగిపోయి ధర్మం అనేది అంతరించిపోయే సమయంలో విష్ణుమూర్తి మానవ అవతారం జన్మించి రాక్షాస సంహారం చేసి ధర్మాన్ని నెలకొల్పుతారని హిందువులు నమ్ముతారు.

ధర్మాన్ని నిలబెట్టడానికి, మానవాళిని సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణుని అవతారం.

తనకు స్వయాన మేనమామ అయిన కంసుడు చేస్తున్న దుర్మార్గాలు, దౌర్జన్యాల నుండి ప్రజలను రక్షించేందుకు, రాక్షాసులను సంహరించేందుకు, అధర్మ వినాశనం చేసేందుకు భూలోకంలోకి తిరిగి వస్తాడు ఆ దేవుడు.

ఈ అవతారం కంసాది దానవులను వధించాడు. ధర్మాన్ని పాటించిన పాండవులకు అండగా నిలుస్తాడు. అంతేకాదు యుద్ధరంగంలో గీతాకారునిగా అర్జునిడి అద్భుతమైన విషయాలను హితబోధ చేశాడు.

చావు మరియు పుట్టుకల పరమార్థం ఏంటో తెలియజేశాడు. దాన్నే మనం ఇప్పుడు భగవద్గీతగా చదువుకుంటున్నాం. ఈ విశ్వంలో ప్రతి అణువులోనూ... రేణువులోనూ నేనుంటాను, ప్రతి విషయాన్ని నా కనుసన్నలలోనే ఉంటుందని చెప్పాడు. అంతటి గొప్ప శక్తి సంపన్నుడైన శ్రీకృష్ణుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఎనిమిదో సంతానం..
పురాణాల ప్రకారం.. కంసుడు పరమ రాక్షసుడు. తనకు దేవకి అనే చెల్లులు ఉంటుంది. ఆమె అంటే అతనికి అమితమైన ప్రేమ. ఆమెకు వసుదేవుడినిచ్చి పెళ్లి చేసి ఆనందంగా అత్తారింటికి సాగనంపే సమయంలో.. కంసుడికి ఆకాశవాణి ద్వారా తన చెల్లెలి కడుపులో ఎనిమిదో సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని చంపేస్తాడని చెబుతుంది.

చెల్లి, బావలను చెరసాలలో..
దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న కంసుడు తన సొంత చెల్లి దేవకిని, బావ వసుదేవుడిని బలవంతంగా చెరసాలలో బంధిస్తాడు. వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చాలా కర్కశంగా చంపేస్తుంటాడు.

కంసుడికి ముందే తెలుసు..
అలా ఏడుగురి బిడ్డలు పురిట్లోనే చనిపోయిన తర్వాత దేవకీ దేవి ఎనిమిదోసారి గర్భం దాలుస్తుంది. ఈసారి జన్మించబోయే బిడ్డే తనను సంహరిస్తాడని కంసుడికి ముందే తెలుసు. కాబట్టి చెరసాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేస్తాడు.

శ్రావణ మాసంలో..
ఎనిమిదోసారి నెలలు నిండిన దేవకీ శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిని నక్షత్ర లగ్నంలో అర్థరాత్రి వేళ కృష్ణుడు జన్మిస్తాడు. ఆ సమయంలో ఆ బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలనుకున్న తల్లిదండ్రులకు విష్ణుమూర్తి ఏం చేయాలో చెబుతాడు.

రేపల్లెకు పయనం..
ఆ వెంటనే వసుదేవుడి సంకెళ్లు తెరచుకుంటాయి. కారాగారం తలుపులు కూడా వాటంతట అవే తెరచుకుంటాయి. అక్కడు కాపలా కాసేవారు సైతం పడిపోతారు. ఆ సమయంలో బాలకృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లెకు బయలుదేరుతాడు.

కుండ పోత వర్షం..
అదే సమయంలో దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది. ఆ వర్షం చిన్నికృష్ణుడిపై పడకుండా ఆదిశేషుడు పడగలా మారి వారికి గొడుగుగా మారతాడు.

తిరిగి చెరసాలకు..
ఆ తర్వాత వసుదేవుడు యమునా నదిని దాటుకుంటూ చివరికి రేపల్లె చేరుకుంటాడు. అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది. వసుదేవుడు శ్రీకృష్ణుడిని యశోద పక్కనబెట్టి.. ఆ ఆడబిడ్డను తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుండి తిరిగి చెరసాలకు చేరుకుంటాడు.

కంసునికి సమాచారం..
ఆ తర్వాత భటులు నిద్ర నుండి మేల్కొంటారు. పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం తెలియజేస్తారు. దేవకి ఆడపిల్లకు జన్మనిచ్చిందనే విషయం తెలుసుకున్న కంసుడు కొంత ఆశ్చర్యానికి గురవుతాడు. ఎందుకంటే ఎనిమిదో సంతానం మగబిడ్డ పుడతాడని ఆకాశవాణి చెప్పింది. అయినా ఆ పాపను చంపాలని వెళ్తాడు. ఆమె నుండి తనకు ఏ సమస్యా ఉండదని, దేవకి అన్నను బతిమిలాడినప్పటికీ, ఆ బిడ్డను చంపే ప్రయత్నం చేస్తాడు కంసుడు.

గోకులాష్టమిగా ప్రసిద్ధి..
ఆ సమయంలో ఆ పాప యోగ మాయగా మారి.. కంసునికి దొరక్కుండా పైకి ఎగసి.. ‘నిన్ను చంపేవాడు పుట్టాడు. రేపల్లెలో పెరుగుతున్నాడు' అని చెప్పి మాయమవుతుంది. నందుడి ఇంట అప్పటికే మరో మగ బిడ్డ జన్మించడంతో.. రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తాడు. అదే గోకులాష్టమి(కృష్ణాష్టమి, శ్రీకృష్ణుని జయంతి)గా ప్రసిద్ధికెక్కింది.



Click it and Unblock the Notifications











