అద్భుతమైన పౌష్ఠికాహారం ఇదే..డయాబెటిస్ ఉన్నోళ్లు కూడా తినొచ్చు,జొన్న ఖిచిడి ఎలా చేయాలంటే

Posted By:

ఈ మధ్యకాలంలో మిల్లెట్స్ కు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అని భావిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. మిల్లెట్స్ లో ఒకటైన జొన్నలలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఇతర ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జొన్నలలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. జొన్నలు శరీరానికి చలువ చేస్తాయి. చర్మం,జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి.

జొన్నలతో చేసే ఖిచిడీ ఎప్పుడైనా తిన్నారా? వాస్తవానికి జొన్న ఖిచిడి ఒక సంప్రదాయ దక్షిణ భారత వంటకం. ఇది అద్భుతమైన రుచికి పెట్టింది పేరు, ఆరోగ్యకరమైనది కూడా. బరువు తగ్గాలనుకునేవారికి ఇదోక సూపర్ ఫుడ్. ఎవ్వరైనా దీనిని తినవచ్చు. డయాబెటిస్ పేషెంట్లు కూడా హాయిగా తినగలిగే జొన్న ఖిచిడి ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

జొన్న ఖిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు

జొన్న రవ్వ - 1 కప్పు
పెసర పప్పు - 1/2 కప్పు
నీరు - 4 కప్పులు
ఉల్లిపాయ - 1
టమోటా - 1
క్యారెట్ - 1
బంగాళాదుంప - 1
పచ్చి బఠానీలు - 1/4 కప్పు
పచ్చిమిర్చి - 2
అల్లం - 1 అంగుళం
ఆవాలు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
కరివేపాకు - కొన్ని ఆకులు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా

సూపర్ టేస్టీ చికెన్ హండీ..రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి

జొన్న ఖిచిడి తయారీ విధానం

-ముందుగా పెసర పప్పును ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి 30 నిమిషాలు నానబెట్టాలి.

-జొన్న రవ్వను కూడా ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి.

-స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి ఆయిల్ వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర,కరివేపాకు, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ చీలికలు వేసి, అల్లం తురుము వేసి వేయించాలి.

-ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించిన తర్వాత ఇందులో టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి.

-తర్వాత అందులో క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, పచ్చి బఠానీలు వేసి 2-3 నిమిషాలు వేయించాలి.

-తర్వాత అందులో నానబెట్టిన పెసర పప్పు వేసి కలపాలి.

-ఇప్పుడు అందులో జొన్న రవ్వ, నీరు, ఉప్పు వేసి బాగా కలపి కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.

-తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేస్తే వేడి వేడి జొన్న ఖిచిడి రెడీ.

-వేడి వేడి జొన్న కిచిడిని పెరుగు లేదా నచ్చిన చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, February 25, 2025, 8:21 [IST]
Desktop Bottom Promotion