ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్‌ ఫుడ్‌ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.!

బరువు తగ్గేందుకు, షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచేందుకు డైట్‌లో తప్పనిసరిగా జొన్న రొట్టెలను చేర్చుకుంటారు. ఇందులోని పుష్కలమైన ఫైబర్‌ కారణంగా త్వరగా కడుపు నిండటంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మెరుగైన జీర్ణక్రియకు దోహదపడుతుంది. అయితే ఎప్పుడూ రొట్టెలే తినాలంటే బోర్‌ కొడితే మాత్రం.. ఇలా కొత్తగా జొన్న మేతి పరాటా ట్రై చేయండి. శరీరంలో రక్తం పెంచి, బలాన్ని అందిస్తుంది.

Jonna methi Paratha recipe process a dish that boosts blood levels and provides strength

జొన్న మేతి పరాటా తయారీకి కావాల్సిన పదార్థాలు

జొన్న పిండి- కప్పు
గోధుమ పిండి- పావు కప్పు
మెంతి ఆకులు- కప్పు
ఉప్పు- రుచికి సరిపడా
ధనియాల పొడి- టీస్పూన్‌
కారం- పావు టీస్పూన్‌
పచ్చిమిర్చి పేస్ట్‌- అర టీస్పూన్‌
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- టీస్పూన్‌
జీలకర్ర పొడి- అర టీస్పూన్‌
పసుపు- పావు టీస్పూన్‌
నువ్వులు- మూడు టీస్పూన్లు
పెరుగు- ముప్పావు కప్పు
నూనె- రెండు టీస్పూన్లు

జొన్న మేతి పరాటా తయారీ విధానం

స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'!

ముందుగా ఒక బౌల్‌లో జొన్న పిండి, గోధుమ పిండి తీసుకుని కలుపుకోవాలి. అందులో కడిగిన మెంతి ఆకులు, ఉప్పు, ధనియాల పొడి, కారం, పచ్చిమిర్చి పేస్ట్‌, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, జీలకర్ర పొడి, పసుపు, నువ్వులు, పెరుగు, నూనె వేసి పిండిని బాగా కలుపుకోవాలి.

పిండిలో తడి సరిపోకపోతే మరికాసిన్ని నీళ్లు కలిపి చపాతీ ముద్దలాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి పదినిమిషాలు పక్కన పెట్టండి.

Jonna methi Paratha recipe process a dish that boosts blood levels and provides strength

ఇప్పుడు పిండి ముద్దను కొంచెంకొంచెంగా తీసుకుని చపాతీ మాదిరిగా ఒత్తుకోవాలి. గుండ్రంగా రాకపోతే ఆకృతి కోసం ఏదైనా రౌండ్‌ ప్లేట్‌తో ఒత్తుకోవచ్చు. అవసరమైతే రొట్టెకి రెండు వైపులా కొన్ని నువ్వులు చల్లుకుని అద్దుకోవచ్చు.

మొఘలాయ్‌ తవా చికెన్‌.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్‌ కూడా వదలకుండా తినేస్తారు.!

ఇలా అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్‌పైన పాన్‌ పెట్టుకుని ఒక్కొక్కటి కాల్చుకోవాలి. ముందుగా ఎలాంటి ఆయిల్‌ వేయకుండా 50శాతం కాలేవరకు రెండు వైపులా కాల్చుకోవాలి. తర్వాత నెయ్యి లేదా బటర్‌ వేసి కాల్చుకోవడం ద్వారా పొంగుతూ వస్తాయి.

ఇదే మాదిరిగా అన్ని పరాటాలను కాల్చుకోవాలి. ఇలా చేసుకోవడం ద్వారా ఎంతసేపైనా మెత్తగా ఉంటాయి. వీటిని డిన్నర్‌లో లేదా బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవచ్చు. పెరుగు, ఏదైనా గ్రేవీ కర్రీతో తింటే అద్భుతంగా ఉంటుంది. డయాబెటిస్‌ బాధితులు తప్పనిసరిగా తమ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఎంతో మేలు చేస్తుంది.

[ of 5 - Users]
Story first published: Sunday, October 4, 2026, 18:08 [IST]
Desktop Bottom Promotion