Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
నోట్లే పెట్టుకుంటే కరిగిపోయే కొబ్బరి లడ్డు..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
కొబ్బరి లడ్డు పేరు వింటే ఒక్కసారిగా బాల్యం గుర్తుకు వచ్చేస్తోంది. అప్పట్లో స్కూల్ కి వెళ్తూ వీటిని జేబుల్లో,బాక్సుల్లో పెట్టుకుని వెళ్లి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ ఆస్వాదిస్తూ తినేవాళ్లం. చాలా రుచిగా ఉండే కొబ్బరి లడ్డూలు.. తెలుగు రాష్ట్రాల్లో అనాదిగా వస్తున్న ఒక ఆరోగ్యకరమైన స్వీట్. పండుగలకు, శుభకార్యాలకు, లేక సాధారణంగా అల్పాహారంగా చాలా ఇళ్ళల్లో వీటిని తయారు చేస్తారు. వీటిని కేవలం రుచికోసం మాత్రమే కాకుండా వాటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల వల్ల కూడా తరచుగా చేసుకుంటారు. వీటిని తయారు చేయడం చాలా సులభం. కొబ్బరి లడ్డూని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
బెల్లం కొబ్బరి లడ్డూలు తయారీకి కావాల్సిన పదార్థాలు
పచ్చి కొబ్బరి తురుము- 2 కప్పులు
బెల్లం తురుము: 1.5 కప్పు
నెయ్యి: 2-3 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి: 1 టీస్పూన్
నీరు: పావు కప్పు

బెల్లం కొబ్బరి లడ్డూ తయారీ విధానం
-ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా తురుముకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లా కాకుండా కొంచెం పలచగా ఉండేలా చూసుకోవాలి.
-స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో బెల్లం తురుము, పావు కప్పు నీరు పోసి చిన్న మంటపై బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగి పాకం లా మారిన తర్వాత దాన్ని వడపోసుకోవాలి.
-వడపోసుకున్న బెల్లం పాకాన్ని తిరిగి అదే గిన్నెలో వేసి, మీడియం మంటపై ఉడికించాలి. పాకం కొద్దిగా చిక్కబడుతున్నప్పుడు అందులో ఒక టీస్పూన్ నెయ్యి వేయాలి. ఇది పాకానికి మంచి సువాసనను ఇస్తుంది, ఉండలు మెరిసేలా చేస్తుంది.
Ragi Burfi: రాగి పిండి,బెల్లంతో..నోట్లో వెన్నలా కరిగిపోయే రాగి బర్ఫీ..ఎలా చేసుకోవాలంటే
-పాకం కొద్దిగా చిక్కబడిన తర్వాత సిద్ధం చేసుకున్న కొబ్బరి తురుమును అందులో వేసి బాగా కలపాలి. కొబ్బరి తురుము, బెల్లం పాకం రెండూ బాగా కలిసిపోయేలా చిన్న మంటపై కలుపుతూ ఉండాలి. మిశ్రమం గిన్నెకు అంటుకోకుండా దగ్గర పడే వరకు ఉడికించాలి. దీనికి సుమారు 10-15 నిమిషాలు పట్టవచ్చు. స్టవ్ ఆఫ్ చేసే ముందు అందులో యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
-మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారనివ్వకూడదు..కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మీ చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, చిన్న చిన్న ఉండలుగా చుట్టాలి. ఉండలు మీ ఇష్టానుసారం చిన్నవిగా లేదా పెద్దవిగా చేసుకోవచ్చు.
-చల్లారిన తర్వాత ఈ ఉండలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఇవి సుమారు 1-2 వారాల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
