Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే..దీపావళికి అదిరిపోయే జ్యూసీ జ్యూసీ స్వీట్..ఎలా చేసుకోవాలంటే..
పండుగ వచ్చిందంటే తెలుగు వారి ఇళ్లలో పిండిపదార్థాలు,స్వీట్లను తయారుచేయడం ఆనవాయితీ. ఏ పండుగ అయినా సరే ఆ సందర్భానికి తగిన పిండిపదార్థాలు,స్వీట్లు తయారుచేస్తుంటారు. అయితే దీపావళి వచ్చేసింది. దీపావళికి తెలుగువాళ్ల ఇళ్లు క్రాకర్స్ తో పాటు స్వీట్లతో కూడ నిండి ఉంటాయి. అయితే స్వీట్ తయారుచేయాలంటే చాలా ఖర్చు, శ్రమతో కూడిన పని అని చాలామంది మార్కెట్ కి వెళ్లి స్వీట్లను కొని తెచ్చుకొని పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఇంట్లోనే హెల్దీగా తక్కువ ఖర్చుతో దీపావళికి స్పెషల్ స్వీట్ ని రెడీ చేసుకోవచ్చు. అది కూడా రెగ్యులర్ గా వంటగదిలో ఉండే పదార్థాలతోనే దీపావళికి స్పెషల్ స్వీట్ ను రెడీ చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-బొంబాయి రవ్వ
-యాలకలు
-నెయ్యి
-చక్కెర
-ఆయిల్
-వంటసోడా
-పాలు

తయారీ విధానం
-ముందుగా మిక్సీ గిన్నెలో అరకప్పు బొంబాయి రవ్వ(సుజీ రవ్వ), 1 యాలక వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవ్వదు.కొంచెం రవ్వ రవ్వగానే ఉంటది.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 1 కప్పు చిక్కటి పాలు పోయండి. పాలను ఒక పొంగు వచ్చేవరకు కాగాక అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి(కొబ్బరి వెనుక ఉండే బ్రౌన్ కలర్ భాగం తీసేసిన పొడి), గ్రైండ్ చేసుకున్న రవ్వ వేసి కలుపుతూ ఉడికించాలి. బాగా మ్యాష్ చేస్తూ ఒక ముద్దగా అయ్యేదాకా పాన్ కి అంటుకోకుండా సపరేట్ అయ్యేవరకు కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కలిపిన ముద్దలో 1 టీస్పూన్ నెయ్యి వేసి కలిసేలా కలుపుకొని పలుచగా స్ప్రెడ్ చేసి గోరువెచ్చగా అయ్యేవరకు మూతపెట్టి పక్కన ఉంచండి.
-తర్వాత స్టవ్ మీద వెడల్పుగా ఉండే గిన్నె పెట్టి అందులో 1 కప్పు చక్కెర, 1కప్పు నీళ్లు పోసి చక్కెర పూర్తిగా కరిగాక అందులో 2 యాలకలు వేసి పాకం జిగురు జిగురుగా వచ్చేదాకా ఉడికించి స్టవ్ ఆపేసి మూతపెట్టి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ముందుగా కలిపిన రవ్వ పిండి మిశ్రమంలో చిటికెడు వంటసోడా వేసి బాగా కలిసేలా మర్దన చేస్తున్నట్లుగా 5 నిమిషాలు కలుపుకోవాలి. కలిపేటప్పుడు పిండి మరీ గట్టిగా అనిపిస్తే 1-2 టీస్పూన్ల పాలు పోసుకోండి. కలిపిన తర్వాత పిండి సాఫ్ట్ గా(మెత్తగా) ఉండాలి.
-తర్వాత పిండిని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని చిన్న చిన్న బుల్లెట్స్ లా చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మధ్యస్థంగా వేడెక్కాక అందులో రెడీ చేసుకున్న పిండి బుల్లెట్స్ ని వేసి బాగా ఎర్రగా కాలేదాకా వేయించాక ఆయిల్ లో నుంచి తీసి రెడీ చేసుకున్న చక్కెర పాకంలో వేసి కొన్ని సెకన్ల పాటు నాననిచ్చి బయటకు తీసేయండి. అంతే దీపావళి స్వీట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications