జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా..

Posted By:

జున్ను అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. అంటే జున్ను పాలు అవసరం లేకుండా అదే టేస్ట్ తో జున్ను తయారుచేసుకోవచ్చని మీకు తెలుసా? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇంట్లోనే జున్ను తయారుచేసుకోవచ్చు.

గడ్డలా, జ్యూసీగా, టేస్టీగా కరెక్ట్ గా జున్ను రావాలంటే మాత్రం కొన్ని టిప్స్ పాటించాల్సిందే. జున్ను పాలు లేకుండా అదే రుచితో జున్ను ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Junnu Recipe Without Junnu Palu Step by Step Easy Telugu Guide

జున్ను పాలు లేకుండా జున్ను తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో తురిమిన బెల్లం ముప్పావు కప్పు(100-120 గ్రా)వేసుకోండి. ఇందులో 2 కప్పుల పాలు(అర లీటరు)పోసుకోండి. గరిటతో బాగా కలుపుకోండి. బెల్లం కరిగిపోవాలి.

-బెల్లం పాలలో పూర్తిగా కరిగిపోయిన తర్వాత అందులోనే ముప్పావు కప్పు(100 గ్రాములు) జున్ను పౌడర్ వేసుకోండి. జున్ను పౌడర్ మీకు సూపర్ మార్కెట్స్, ఆన్ లైన్ లో దొరుకుతుంది. జున్ను పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా విస్కర్ తో బాగా కలుపుకోవాలి.

-ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులో లోపల అడుగన కొంచెం నెయ్యి రాసుకోండి. తర్వాత ఇందులో కలిపి ఉంచుకున్న పాల మిశ్రమాన్ని వడకడట్టి పోసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంలోనే పావు టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ యాలకల పొడి, అర టీస్పూన్ మిరియాల పొడి వేసుకోండి. వీటన్నింటిని బాగా కలిపి గిన్నెపై మూతపెట్టి పక్కన పెట్టుకోండి.

శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా..

-ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకోండి. అందులో నీళ్లు పోసి మధ్యలో ఒక స్టాండ్ పెట్టి మూతపెట్టి నీటిని మరిగించాలి.

-నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మధ్యలో ఉన్న స్టాండ్ మీద కలిపి పెట్టుకున్న జున్ను పాల గిన్నె పెట్టుకోండి. ఇడ్లీ పాత్ర మూతపెట్టేసి కనీసం అరగంట సేపు ఉడికించాలి. మంటను మీడియంలోనే ఉంచాలి.

-తర్వాత మూత తీసి చాకుతో మిశ్రమంలో గుచ్చితే అడుగన పాలలాంటి పదార్ధం అంటుకోకుండా రావాలి. అలా వస్తే పర్ఫెక్ట్ గా ఉడికినట్లే.

-ఇప్పుడు ఆ జున్ను గిన్నెను ఇడ్లీ పాత్రలో నుంచి బయటకు తీసి చల్లారనివ్వాలి. దీనిని ఫ్యాన్ కింద ఆరబెట్టడం లేదా నీళ్లల్లో పెట్టడం లాంటిది చేయవద్దు. నార్మలాగా అలా వదిలేసి చల్లారనివ్వాలి. అలా చల్లారితేనే జున్ను గడ్డలా వస్తుంది.

-చల్లారాక మీకు నచ్చిన షేపులో జున్నుని ముక్కలుగా కట్ చేసుకోండి. అంతే జున్ను రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, September 22, 2026, 12:53 [IST]
Desktop Bottom Promotion