Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఇంట్లో ఉండే వాటితోనే.. మడత కాజాని మించిన రుచితో సూపర్ స్వీట్!
ఎప్పుడూ ఓకే రకమైన స్వీట్లు తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే మీ ఇంట్లో కప్పు గోధుమ పిండి ఉంటే ఓ అద్భుతమైన స్వీట్ రెడీ చేసుకోండి. టేస్ట్ అదిరిపోతుంది.
దీని తయారీకి ఎక్కువ సమయం పట్టదు. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీ జ్యూసీగా టేస్ట్ భలే ఉంటాయి. ఈ స్వీట్ ని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-గోధుమ పిండి
-మైదా పిండి
-చక్కెర
-నూనె
-యాలకల పొడి
-నెయ్యి
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో అర కప్పు మైదా పిండి, అర కప్పు గోధుమ పిండి వేసి ఇందులోనే చిటికెడు ఉప్పు వేసి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. గట్టిగా కలుపుకున్నాక గిన్నెపై మూతపెట్టి దీనిని పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 1కప్పు చక్కెర, 1కప్పు నీళ్లు పోసి చక్కెర పూర్తిగా కరిగేదాకా మరిగించాక ఇందులో అర టీస్పూన్ యాలకల పొడి వేసి కలిపి గులాబ్ జామ్ కి పాకం ఎలా చేసుకుంటామో అలా అయ్యాక స్టవ్ ఆపేసి గిన్నెపై మూతపెట్టి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ముందుగా కలుపుకున్న మరొకసారి చేత్తో కలుపుకున్నాక పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. తర్వాత ఒక్కో పిండి ముద్దను తీసుకొని మరీ పల్చగా కాకుండా,మరీ మందంగా కాకుండా పల్చగా, చిన్న చపాతీలా రెడీ చేసుకోవాలి.
-తర్వాత వత్తుకున్న ఒక్కో చపాతీని పీట మీద పెట్టి 3 చుక్కల నెయ్యిని ఆ చపాతీ మీద వేసుకొని దాన్ని చేత్తో మొత్తం పరుచుకున్నట్లు చేశాక, దీని మీద పొడి మైదా పిండి చల్లుకొని దీని మీద వేరొక చపాతీ పర్చుకోవాలి.
-ఇలా ప్రతి ఒక్క చపాతీపై 3 చుక్కల నెయ్యి వేసుకొని తర్వాత పొడి మైదా పిండి చల్లుకొని దానీ మీద మరో చపాతీ పెట్టడం చేసుకోవాలి. ఒకదానిపై ఒకటి ఇలా వేసుకున్న తర్వాత దీనిని గొట్టంలా మడుచుకోవాలి.

-సన్నగా రోల్ లాగా చేసుకున్న తర్వాత చాకుతో దానిని అర ఇంచు వదులుతూ ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఆ తర్వాత కట్ చేసిన ముక్కలను చేతితో రౌండ్ గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
-రౌండ్ గా చేసుకున్న తర్వాత దానిపై పొడి పిండి చల్లుకుంటూ పల్చని పూరీలా కర్రతో వత్తుకోవాలి. మరీ గట్టిగా వత్తుకోకూడదు..అలా చేస్తే లేయర్స్ పోతాయి.
-అన్నీంటినీ వత్తుకొని ఓ ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేశాక అందులో వత్తుకున్న ఒక్కో పూరీని అందులో వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా లేత బంగారు రంగు వచ్చేదాకా వేయించి ఓ ప్లేట్ లోకి తీసుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేయాలి.
-ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్ చక్కెర పాకంలో రెడీ చేసుకున్న ఒక్కో పూరీని వేసి రెండు వైపులా అర నిమిషం డిప్ చేసి ఓ ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి.
-ప్లేట్ లో రెడీ అయి ఉన్న పూరీలపై కొంచెం చక్కెర చల్లుకోండి. అంతే క్రిస్పీ, జ్యూసీ గోధుమ పిండి స్వీట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
