Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
కుందాపుర స్టైల్ చికెన్ ఘీ రోస్ట్..కర్ణాటక రుచుల్లో రారాజు,జన్మలో మర్చిపోలేని రుచి..ఎలా చేసుకోవాలంటే
కర్ణాటక రాష్ట్రంలోని కుందాపుర ప్రాంతంలో చేసే చికెన్ ఘీ రోస్ట్.. ఒక్కసారి టేస్ట్ చూస్తే జన్మలో వదిలిపెట్టరు. దీని ప్రత్యేకత ఏంటంటే సుగంధ ద్రవ్యాలు, చికెన్ తో తయారయ్యే ఈ వంటకం కొద్దిగా తీయగా, కొంచెం ఘాటుగా, సుగంధభరితంగా ఉంటుంది. సాధారణంగా విందులలో లేదా ప్రత్యేక సందర్భాలలో దీనిని తయారు చేస్తుంటారు. మీరు కూడా మీ ఇంట్లో దీనిని సులభంగా తయారుచేసుకోవచ్చు. కుందాపుర స్టైల్ చికెన్ ఘీ రోస్ట్ ని మీ ఇంట్లో తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కుందాపుర చికెన్ ఘీ రోస్ట్ తయారీకి కావాల్సిన
పదార్థాలు
-చికెన్ లెగ్ పీసులు
-పెరుగు
-మెంతులు
-కారం
-ఉప్పు
-పసుపు
-జీలకర్ర
-కరివేపాకు
-మిరియాలు
-ధనియాలు
-ఎండుమిర్చి
-లవంగ మొగ్గలు
-దాల్చిన చెక్క
-చింతపండు
-నెయ్యి
-ఉల్లిపాయ

చికెన్ ఘీ రోస్ట్ తయారీ విధానం
-ముందుగా 10-15 ఎండుమిరపకాయలను అరగంట సేపు నీటిలో నానబెట్టాలి.
-తర్వాత అరకేజీ చికెన్ లెగ్ పీస్ ముక్కలను శుభ్రంగా కడిగి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ పెరుగు, రుచికి సరిపడా కారం, ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలిపి దానిని అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేయండి.
సైడ్ డిష్ అక్కర్లేదు,ఒట్టిగానే లాగించేయొచ్చు..ఆలూ పులావ్ క్షణాల్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూడండి
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో కొద్దిగా మెంతులు, అర టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 3 లవంగ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర వేసి ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి.
-వేగిన తర్వాత ఈ మసాలాలను మిక్సీ గిన్నెలో వేసి అందులోనే 10 వెల్లుల్లి రెబ్బలు, నిమ్మపండు సైజు చింతపండు,నానిన ఎండుమిర్చి కూడా వేసి కొంచెం నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 50 ml నెయ్యి వేసి వేడయ్యాక అందులో 1 ఉల్లిపాయ తరుగు, 1 రెబ్బ కరివేపాకు వేసి ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అందులో ఫ్రిడ్జ్ లో ఉంచిన చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి 15 నిమిషాలు మీడియం మంటమీదనే ఉడికించుకోవాలి.
-15 నిమిషాల తర్వాత అందులో మిక్సీలో గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసి చికెన్ ముక్కలకు అది బాగా పట్టేలా కలిపి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి 20 నిమిషాలు మీడియం మంటమీదనే ఫ్రై చేసుకోవాలి. అంతే కుందాపుర స్టైల్ చికెన్ ఘీ రోస్ట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
