Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
శివుడికి అత్యంత ఇష్టమైన రెసిపి..శివరాత్రి నాడు నైవేద్యంగా ఇది పెడితే అడిగిన వరాలన్నీ ఇచ్చేస్తాడు,ఎలా చేయాలంటే
శివుడు ఆగ్న లేనిదే చీమ కూడ కదలదు అంటారు. సకల చరాచర జగత్తుకు లయకారకుడు ఆ పరమేశ్వరుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి. యావత్ సృష్టిని నడిపించే ఆ శంభుడే మాఘ మాసం బహుళ చతుర్ధశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించిన దినం కావడంతో మహాశివరాత్రిగా పరిగణిస్తారు. ఈ ఏడాది మహాశివరాత్రిని ఫిబ్రవరి 26న జరుపుకుంటారు.
మహాశివరాత్రి సందర్భంగా శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజు శివుడు, పార్వతిదేవికి దేవాలయాలు,ఇళ్లలో నైవేద్యాలు సమర్పిస్తారు, దీనిలో తాండైని ప్రత్యేక ప్రసాదంగా సమర్పిస్తారు. మీరు కూడా ఈ మహాశివరాత్రికి మీ ఇంట్లో శివుడికి అత్యంత ఇష్టమైన తండైని తయారు చేయాలనుకుంటే ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

తాండై తయారీకి కావాల్సిన పదార్థాలు
-అరకప్పు బాదంపప్పు
-2 టేబుల్ స్పూన్లు గసగసాలు
-2 టేబుల్ స్పూన్లు పుచ్చకాయ గింజలు
-2 టేబుల్ స్పూన్లు సోంపు గింజలు
-8-10 నల్ల మిరియాలు
-6-8 ఏలకులు
-10-12 కుంకుమపువ్వు రేకులు
-2 టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ లేదా ఎండిన గులాబీ రేకులు
-అర కప్పు చక్కెర
-1 లీటరు పాలు
-అరకప్పు కప్పు చల్లటి నీరు
-8-10 జీడిపప్పు,పిస్తాపప్పులు
తాండై తయారీవిధానం
-ముందుగా బాదం, గసగసాలు, బాదం, సోంపు, నల్ల మిరియాలు, ఏలకులను నీటిలో 4-5 గంటలు నానబెట్టండి.
-తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేయాలి.
-ఈ పేస్ట్‌ను ఒక పెద్ద పాత్రలో పోసి ఇందులో చల్లటి నీరు పోసి బాగా ఫిల్టర్ చేయండి.
-ఇప్పుడు అందులో పాలు, చక్కెర, రోజ్ వాటర్ కలపండి. పైన కుంకుమపువ్వు వేసి తాండై 1-2 గంటలు ఫ్రిజ్‌లో చల్లబరచండి.
-గ్లాసులో తాండై పోసి..తరిగిన జీడిపప్పు, పిస్తాపప్పులతో అలంకరించి సర్వ్ చేయాలి.
-ఈ మహాశివరాత్రిక మహాదేవునికి ఇష్టమైన ప్రసాదం తాండైని తయారు చేసి దానిని ఈశ్వరుడికి సమర్పించి,తర్వాత ప్రసాదంగా మీరు స్వీకరించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications