Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
రాయలసీమ స్పెషల్ పొడి..ఇడ్లీ,దోసెల్లోకి ఏ చట్నీలు అక్కర్లేదు..నెయ్యితో తింటే ఎన్నైనా పోతూనే ఉంటాయ్
చిట్లం పొడి అనేది రాయలసీమ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన, రుచికరమైన కారంపొడి. రాయలసీమ చిట్లం పొడి ఆ ప్రాంతపు సంస్కృతి, రుచులను ప్రతిబింబించే ఒక ప్రత్యేక వంటకం. దీనిని ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ కు ప్రధాన సైడ్ డిష్ గా వడ్డిస్తారు. ఈ కారం వేసుకొని నెయ్యి యాడ్ చేసి ఇడ్లీ తింటుంటే ఎన్ని తిన్నా అలా పోతూనే ఉంటాయి. అంతేకాకుండా వేడి అన్నంలో నెయ్యితో కలిపి తిన్నా దీని రుచి అద్భుతంగా ఉంటుంది.
వంట చేయడానికి సమయం లేనప్పుడు లేదా రుచికరమైన కూర లేనప్పుడు ఈ పొడి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. బ్యాచిలర్స్ కి చిట్లం పొడి ఒక వరం లాంటిది. ఒక్కసారి తయారుచేసుకుంటే, ఇది 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. చిట్లం పొడి కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, ఇందులో వాడే పదార్థాల వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రాయలసీమ చిట్లం పొడిని మీ ఇంట్లో ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-పచ్చి శెనగపప్పు
-మినపగుండ్లు
-కందిపప్పు
-ఎండుమిరపకాయలు
-మిరియాలు
-జీలకర్ర
-చింతపండు
-ఉప్పు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో పావు కప్పు పచ్చి శెనగపప్పు వేసి తక్కువ మంట మీద 4-5 నిమిషాలు కలుపుతూ వేయించాక దీన్ని ఓ ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో పావుకప్పు మినపగుండ్లు వేసి తక్కువ మంట మీద ఎర్రగా అయ్యేదాకా వేయించుకొని ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లోనే పావుకప్పు కందిపప్పు వేసి తక్కువ మంట మీద ఎర్రగా,మంచి సువాసన వచ్చేదాకా వేయించి ప్లేట్ లోకి తీసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లోనే 25 ఎండుమిరపకాయలు వేసి రంగు మారేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు ప్టవ్ మీద పాన్ లోనే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిట్లేదాకా వేపుకొని ప్లేట్ లోకి తీసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లోనే పెద్ద గోలీ సైజు అంత చింతపండుని వేసి 30 సెకన్ల పాటు వేయించి స్టవ్ ఆపేసి చింతపండును బయటకు తీసుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేయించిన ఎండుమిరపకాయలు,ఉప్పు, చింతపండు వేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఇందులోనే వేయించిన పప్పులన్నీ వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. అంతే చిట్లం పొడి రెడీ.
-పొడిలో కారం తక్కువ అయ్యింది అనిపిస్తే నాలుగు ఎండుమిర్చిని మళ్లీ వేసి పొడి కొట్టి కలిపేసుకుంటే సరిపోతుంది.

కొన్ని ప్రయోజనాలు
చిట్లం పొడిలో కంది పప్పు, మినప పప్పు, శనగ పప్పు వంటి అనేక రకాల పప్పులు ఉంటాయి. ఈ పప్పులన్నీ ప్రోటీన్‌కు మంచి మూలాలు. ప్రోటీన్ కండరాల నిర్మాణానికి, శరీర మరమ్మత్తుకు, రోగనిరోధక శక్తికి చాలా అవసరం. శాఖాహారులకు ఇది అదనపు ప్రొటీన్ అందించడానికి గొప్ప మార్గం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
