Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బలానికి, రుచికి తిరుగులేని బీట్ రూట్ హల్వా..ఎలా చేసుకోవాలంటే..
మన దేశంలో పండుగలు, శుభకార్యాలు లేదా ఇంట్లో ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు స్వీట్ చేయడం ఆనవాయితీ. సాధారణంగా మనం రవ్వ కేసరి, సేమియా పాయసం లేదా క్యారెట్ హల్వా ఎక్కువగా చేస్తుంటాం. కానీ రంగులోనూ, రుచిలోనూ, పోషక విలువల్లోనూ ఎంతో విశిష్టమైనది బీట్ రూట్ హల్వా.
పిల్లలు సాధారణంగా బీట్‌రూట్ తినడానికి మారాం చేస్తారు కానీ దానిని హల్వా రూపంలో ఇస్తే లొట్టలేసుకుంటూ తింటారు. బీట్ రూట్ ను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. హల్వా రూపంలో తీసుకున్నా కూడా అందులోని ఫైబర్, కొన్ని విటమిన్లు మనకు అందుతాయి. నోరూరించే బీట్ రూట్ హల్వా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బీట్‌రూట్: 2 పెద్దవి
కాచి చల్లార్చిన లేదా పచ్చి పాలు: 500 మి.లీ
చక్కెర: 1 కప్పు (150-200 గ్రా)
నెయ్యి: 4-5 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి: అర టీస్పూన్
జీడిపప్పు: 10-15
బాదం: 10
కిస్మిస్: 10-15
కోవా: 50 గ్రాములు
తయారీ విధానం
-ముందుగా బీట్ రూట్ లను శుభ్రంగా కడిగి, పైన చెక్కు తీసేయాలి. తర్వాత వాటిని సన్నగా తురుముకోవాలి. తురుము మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా మధ్యస్థంగా ఉంటే హల్వా టెక్చర్ బాగుంటుంది.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక మందపాటి కడాయి లేదా పాన్ పెట్టుకోండి. అందులో 2 స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కాక జీడిపప్పు, బాదం వేసి దోరగా వేయించాలి. ఇవి సగం వేగాక కిస్మిస్ వేసి, అవి ఉబ్బిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
-అదే కడాయిలో మిగిలిన నెయ్యిలో బీట్ రూట్ తురుమును వేయాలి. మంటను మీడియంలో పెట్టి సుమారు 5-8 నిమిషాల పాటు వేయించాలి. ఇలా నేతిలో వేయించడం వల్ల బీట్ రూట్ కు ఉండే పచ్చి వాసన పోయి, కమ్మటి వాసన వస్తుంది.
-బీట్ రూట్ వేగిన తర్వాత, అందులో పాలు పోయాలి. చిక్కటి పాలు వాడితే కోవా వేయకపోయినా రుచి బాగుంటుంది. పాలు, బీట్ రూట్ తురుమును బాగా కలిపి, మూత పెట్టి మీడియం మంటపై ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు మొత్తం ఇగిరిపోయి, బీట్‌రూట్ మెత్తగా ఉడికేంత వరకు సుమారు 15-20 నిమిషాలుఉడికించాలి.
-పాలు పూర్తిగా ఇగిరిపోయిన తర్వాత చక్కెర వేయాలి. చక్కెర వేసాక మిశ్రమం మళ్ళీ పల్చబడుతుంది..నీరు ఊరుతుంది. ఇప్పుడు మంటను సిమ్ లో పెట్టి ఆ నీరంతా ఆవిరైపోయి హల్వా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి.
-హల్వా పాన్ నుండి వేరుపడుతున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. మీకు కోవా అందుబాటులో ఉంటే, ఈ దశలో వేసి కలపవచ్చు. ఇది హల్వాకు రిచ్ టేస్ట్‌ని ఇస్తుంది.
-చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం, కిస్మిస్) వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే వేడివేడి, ఎర్రటి రంగులో మెరిసిపోయే బీట్ రూట్ హల్వా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications