వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్‌ కర్రీ.!

రెస్టారెంట్‌ పనీర్‌ స్పెషల్స్‌ తలచుకుంటేనే నోరు ఊరిపోయేలా చేస్తాయి. పనీర్‌ ముక్కలు, చీజ్‌ నోటికి సాఫ్ట్‌గా తగులుతూ శరీరానికి పుష్కలంగా ప్రొటీన్‌ అందిస్తాయి. అంతేకాకుండా రక్తహీనతకి ఇది బెస్ట్‌ ఫుడ్‌. కొంచెం శ్రమపడితే అలాంటి టేస్ట్‌నే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇక, ఈ పనీర్‌కి మెంతి ఆకులు జత చేస్తే ఆ రుచి స్వర్గంలో ఉన్న అనుభూతి చెందుతారు. మరి రెస్టారెంట్‌ స్టైల్‌ మేథీ చమన్ కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం..

Methi chaman curry recipe restaurant style taste prepare within 20 mins

మేథీ చమన్‌ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు

పనీర్‌- 200 గ్రాములు
జీడిపప్పు- 50 గ్రాములు
నూనె- 8 టేబుల్‌ స్పూన్లు
సోంపు- అర టీస్పూన్‌
జీలకర్ర- అర టీస్పూన్‌
ఉల్లిపాయ- ఒకటి
పచ్చిమిర్చి- రెండు
అల్లంవెల్లుల్లి పేస్ట్‌- అర టేబుల్‌ స్పూన్‌
టమాటాలు- రెండు చిన్నవి
ధనియాల పొడి- టీస్పూన్‌
పసుపు- పావు టీస్పూన్‌
కారం- టీస్పూన్‌
గరం మసాలా- పావు టీస్పూన్‌
కసూరి మెంతి- టేబుల్‌ స్పూన్‌
ఉప్పు- రుచికి సరిపడా
మెంతి ఆకులు- ఒకటిన్నర కప్పు
తాజా క్రీమ్‌- పావు కప్పు
నెయ్యి- టీస్పూన్‌

మేథీ చమన్‌ కర్రీ తయారీ విధానం

మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

మేథీ చమన్‌ కర్రీ కోసం ముందుగా 100 గ్రాముల పనీర్‌ను ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. జీడిపప్పును గంటపాటు నానబెట్టుకుని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పైన పాన్‌ పెట్టుకుని అందులో నూనె వేసి వేడయ్యాక సోంపు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్‌ చేసిన ఉల్లిపాయలు వేసి రంగుమారేవరకు వేయించుకోవాలి. చిన్నగా కట్‌ చేసిన పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.

Methi chaman curry recipe restaurant style taste prepare within 20 mins

చిన్నగా కట్‌ చేసిన టమాటా ముక్కలు వేసి మెత్తగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా, కసూరి మెంతి, రుచికి సరిపడా ఉప్పు వేసి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి దగ్గరకు ఉడకనివ్వండి.

పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!

తర్వాత కడిగి పెట్టుకున్న మెంతి ఆకులు వేసి కలిపి ఉడికించాలి. మెంతి ఉడికిన తర్వాత జీడిపప్పు పేస్ట్‌ వేసి వేగనివ్వాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి చిన్న మంటపైన ఉడికించుకోవాలి.

నూనె పైకి తేలిన తర్వాత క్యూబ్స్‌ మాదిరిగా కట్‌ చేసుకున్న పనీర్‌ ముక్కలు వేసి కలపాలి. మిగతా పనీర్‌ను తరిగి వేసుకోవాలి. ఫ్రెష్‌ క్రీమ్‌ వేసి కలపాలి. కాసేపు ఉడికిన తర్వాత కసూరి మెంతి, కాస్త నెయ్యి వేసి కలిపి ఉప్పు సరిచూసుకుని రెండు నిమిషాల తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవడమే. టేస్టీ మేథీ చమన్‌ కర్రీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, September 21, 2026, 15:04 [IST]
Desktop Bottom Promotion