Latest Updates
-
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే! -
సమీరా రెడ్డి చేసిన గోవా స్పెషల్ మ్యాంగో కొబ్బరి కర్రీ..అన్నంలోకి అమృతమే..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
పుదీనా చట్నీలో ఈ ఒక్కటి కలపండి.. చట్నీ మరింత రుచికరంగా ఉంటుంది
Mint Peanut Chutney:మీరు ఉదయాన్నే ఇంట్లో ఇడ్లీ లేదా దోసె తయారు చేయబోతున్నారా? దీని కోసం కమ్మని రుచికరమైన చట్నీని తయారు చేయాలని ఆలోచిస్తున్నారా? మీ ఇంట్లో పుదీనా ఉందా? అయితే ఆ పుదీనాతో చట్నీ చేయండి.
మామూలుగా కాకుండా కాస్త వెరైటీగా చేయండి. అందుకు వేరుశెనగలు ఉపయోగించండి. దీంతో చట్నీ రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. ప్రధానంగా ఈ చట్నీని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు.
పుదీనా శనగ చట్నీ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? పుదీనా వేరుశెనగ చట్నీ యొక్క సాధారణ వంటకం క్రింద ఉంది. చదివి రుచి చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
కావాల్సినవి:
* వేయించిన వేరుశెనగ - 1/4 కప్పు
* పుదీనా - 1 కప్పు(ఆకులు కట్ చేసుకుని, శుభ్రంగా కడిగి
పెట్టుకోవాలి)
* కొత్తిమీర - 1/4 కప్పు(ఆకులు కట్ చేసుకుని, శుభ్రంగా కడిగి
పెట్టుకోవాలి)
* చిన్న ఉల్లిపాయ - 1 (తరిగినది)
* పచ్చిమిర్చి - 3
* జీలకర్ర - 1/4 tsp
* చింతపండు - 1 చిన్న ముక్క
* వెల్లుల్లి - 2 రెబ్బలు
* నూనె - 2 టేబుల్ స్పూన్లు
* ఉప్పు - రుచి ప్రకారం
తయారుచేయు విధానం:
* ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో వేరుశెనగ గింజలు(పల్లీలు)
వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి చల్లారనివ్వాలి.
* తర్వాత అదే బాణలిని స్టౌ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక అందులో
జీలకర్ర, ఉల్లి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి 2-3 నిమిషాలు
బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
* తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర, చింతపండు వేసి 1 నిమిషం వేయించి
చల్లారనివ్వాలి.
* తర్వాత మిక్సీ జార్ లో ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగ
గింజలు, వేగిన పుదీనా మిశ్రమం వేసి రుచికి తగ్గట్టుగా ఉప్పు, నీళ్లు
పోసి బాగా గ్రైండ్ చేసుకుంటే రుచికరమైన పుదీనాపల్లీల చట్నీ రెడీ.
* కావాలంటే చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత ఆవాలు, ఉల్లి, కరివేపాకు పోపు
వేసి చట్నీలో కలుపుకోవచ్చు.
Image Courtesy: indianveggiedelight
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












