Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Chicken pakodi: నోరూరించే చికెన్ పకోడీ..బ్యాచిలర్స్ సింపుల్ గా చేసుకోవచ్చు..స్టఫ్ లోకి కేక అంతే
మనదేశంలో నాన్ వెజ్ తినేవాళ్లల్లో చికెన్ వంటకాలను ఇష్టపడేవాళ్ల సంఖ్య చాలా ఎక్కెవే. చికెన్ తో బిర్యానీ చేసినా పకోడీ చేసినా ఏది చేసినా సూపర్ టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా మద్యం తాగేవాళ్లు అయితే మంచింగ్ లోకి చికెన్ పకోడీని(Chicken Pakodi) తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే మద్యం షాపుల దగ్గర ఎక్కువగా చికెన్ పకోడీ అమ్మే స్టాల్స్ కూడా కనబడుతుంటాయి. ఎలాంటి సాస్,చట్నీ లేకపోయినా ఆవురావురమంటూ తినేయచ్చు.
అయితే బయట రోడ్ల మీద షాపుల్లో తక్కువ రకం క్వాలిటీ ఆయిల్ తో అది కూడా పదే పదే అదే ఆయిల్ తో చేసిన చికెన్ పకోడీ అమ్ముతుంటారు కొందరు. కాబట్టి ఇంట్లోనే చాలా ఈజీగా చికెన్ పకోడీ చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్ కి టేస్ట్ కి. చికెన్ పకోడీ చేయడం అంత కష్టం ఏమీ కాదు..చాలా ఈజీగా తక్కువ టైంలో చికెన్ పకోడీ చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
చికెన్ పకోడీ తయారీకి కావాల్సినవి
- బోన్ లెస్ చికెన్
- పెరుగు
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-పసుపు పొడి
-ఎర్ర మిరప పొడి
-గరం మసాలా
-జీలకర్ర పొడి
-ధనియాల పొడి
-నిమ్మరసం
-రుచికి తగినంత ఉప్పు
-శనగపిండి
-బియ్యం పిండి (కావాలి అనుకుంటేనే)
-క్యారమ్ సీడ్స్
- నీరుతగినంత
- డీప్ ఫ్రై చేయడానికి నూనె
తయారీ విధానం
-ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు చేసుకోవాలి.
-ఒక గిన్నెలో చికెన్ వేసి పెరుగు,అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు,
కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి,
నిమ్మరసం,కరివేపాకు,ఉప్పు వేసి బాగా కలపాలి.
-మిశ్రమంలోని ఫ్లేవర్లన్నీ ముక్కకు బాగా పట్టాలంటే గిన్నెపై మూత
పెట్టి 20 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టండి. చక్కగా మారినేట్
అవుతుంది.
-ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులో శనగపిండి,జీలకర్ర, కారం, పసుపు,
ఉప్పు,క్యారమ్ సీడ్స్,కావాలనుకుంటే బియ్యం పిండి వేసి కలపాలి. ఇందులో
నీళ్లు పోస్తూ పిండి కలపండి. చికెన్ ముక్కలను బాగా పూసేంత మందంగా
పిండి ఉండాలి
-20 నిమిషాల తర్వాత ఫిడ్జ్ లో నుంచి మ్యారినేట్ చేసిన చికెన్ ని బయటకు
తీయండి.
-మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కను పిండిలో ముంచి..బాగా పూత పూసినట్లు
ఉండేలా చూసుకోండి
-స్టవ్ వెలిగింది కాస్త లోతుగా ఉండే చిన్న బాండీ పెట్టుకుని నూనె పోసి
వేడి చేయండి. లోతుగా ఉండే చిన్న బాండీ పెట్టుకుంటే తక్కువ నూనెతో
వేపుడు పూర్తవుతుంది. లేకుంటే ఎక్కువ నూనె వేయాలి.
-నూనె వేడెక్కాక చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆ పిండిలో ముంచి
నూనెలో వేస్తూ వేయించాలి.
-బంగారు గోధుమ, క్రిస్పీ అయ్యే వరకు సుమారు 4-5 నిమిషాలు వేయించండి.
అప్పుడప్పుడు అటూ ఇటూ కలబెడుతుండండి.
-ముక్కలు ఎర్రగా వేగాక తీసి గిన్నెలో వేసి కొత్తిమీర చల్లుకోవాలి.
అంతే వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. పెద్దలకే కాదు పిల్లలకు కూడా ఇది
చాలా ఇష్టంగా తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








