Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
మునగకాయ టమాటో కాజు కర్రీ..ఈ పద్ధతిలో చేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ లో, బ్రహ్మకైనా నోట్లో నీళ్లూరాల్సిందే
మునగకాయల టమాటో కాజు కర్రీ ఎప్పుడైనా తిన్నారా? మునగకాయ దాని ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ది. టమాటో కూరకు పులుపు, రుచిని ఇస్తుంది. జీడిపప్పు కమ్మని రుచిని, చిక్కదన్నాన్ని అందిస్తుంది. మునగకాయ ఎందులో వేసిన అద్భుతమే. అలాంటిదాన్ని కాజు, టమాటోతో కలిపి చేస్తే ఇంకేమైనా ఉంటుందా నోట్లో బ్లాస్టే. అన్నం, చపాతీ, రోటీ, నాన్ తో ఇది కలిపి తింటే చాలా బాగుంటుంది. మాటల్లో వర్ణించలేని రుచితో కూడిన మునగకాయ టమాటో కాజు కర్రీని మీ ఇంట్లో ఎలా సులభంగా తయారుచేసుకోవాలి,దీని తయారీకి కావలసిన పదార్థాలు ఏవో ఇక్కడ చూడండి.
మునగకాయ టమాటో కాజు కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు
-మునగకాయ
-టమాటో
-ఆవాలు
-జీలకర్ర
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-జీడిపప్పు
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-ఉల్లిపాయ
-పసుపు
-ఉప్పు
-కరివేపాకు
-గరం మసాలా
-ధనియాల పొడి
-కొత్తిమీర
-ఆయిల్
-కారం
-జీడిపప్పు పేస్ట్
-పెరుగు

మునగకాయ టమాటో కాజు కర్రీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేడి చెయ్యాలి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఇందులో ఎండు మిర్చిమిర్చి ముక్కలు, కొంచెం జీలకర్ర, కొన్ని జీడిపప్పు పలుకులు వేసి అవి లైట్ గా వేగాక అందులో కరివేపాకు, ఉల్లిపాయ తరుగు, పసుపు వేసి వేగనివ్వాలి.
-ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, కొంచెం ఎక్కువగానే టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
-తర్వాత అందులో మునగకాయ ముక్కలు, కొద్దిగా పెరుగు, కొద్దిగా జీడిపప్పు పేస్ట్, కొంచెం నీళ్లు పోసి మొత్తం బాగా కలిసేలా కలిపి మూతపెట్టి 10 నిమిషాలు వండుకోవాలి.
చుక్క ఆయిల్ అక్కర్లేదు..పొద్దున్నే ఈ జొన్న అంబలి తింటే కొండలు ఢీ కొట్టే శక్తి ..ఎలా చేసుకోవాలంటే
-ఉడికి గుజ్జులా ఏర్పడిన తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి, సరిపడా కారం, కొద్దిగా గరం మసాలా,కొన్ని నీళ్లు పోసి కలిపి 4-5 నిమిషాలు ఉడికించాలి.
-ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉప్పు, కారం అడ్జెస్ట్ చేసుకొని చివరగా కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ మీద నుంచి బాండీ దించేయండి. అంతే మునగకాయ టమాటో కాజు కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
