Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
బీరకాయ,పల్లీలతో ఇలా చేశారంటే తిరుగులేని రుచి..నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
బీరకాయ పల్లీ పచ్చడి.. పేరు వినగానే నోరూరే ఈ పచ్చడి, తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇష్టమైన వంటకం. సాధారణంగా బీరకాయను కూరగానో, వేపుడుగానో చేస్తుంటారు. అయితే ఈ పచ్చడి బీరకాయ రుచిని సరికొత్తగా పరిచయం చేస్తుంది. పల్లీల కమ్మదనం, పచ్చిమిర్చి కారం, చింతపండు పులుపు కలగలిసి ఒక అద్భుతమైన రుచిని అందిస్తాయి. ఇది కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాలలో కూడా ముందుంటుంది. మరి ఈ బీరకాయ పల్లీ పచ్చడిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో, దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.
బీరకాయ పల్లీ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినపప్పు
-జీలకర్ర
-పల్లీలు
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-టమాటో
-కొత్తిమీర
-చింతపండు రసం
-ఆయిల్
-ఆవాలు
-పచ్చి శెగనపప్పు
-ఇంగువ
-బీరకాయ
-వెల్లుల్లి
-ఎండుమిర్చి
-పసుపు

బీరకాయ పల్లీ పచ్చడి తయారీ విధానం
-స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి అందులో 1 టీస్పూన్ మినపప్పు, 1 టీస్పూన్ జీలకర్ర వేసి వేయించాక ఇందులో 1 చిన్న కప్పు పల్లీలు, 5 పచ్చిమిర్చి ముక్కలు,కరివేపాకు వేసి వేయించి ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో 250 గ్రాముల తరగి కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసి ఆయిల్ లేకుండానే కలుపుతూ వేయించాలి. 1 నిమిషం తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి.
-ఇప్పుడు అందులో 2టమాటోల ముక్కలు వేసి, పావు టీస్పూన్ పసుపు, అరకప్పు కత్తిమీర కాడలతో సహా వేసి బాగా కలిపాక ఇందులోనే 2 టీస్పూన్ల చింతపండు రసం వేసి కలిపి మూత పెట్టి 3 నిమిషాలు ముక్కలను బాగా మగ్గనివ్వాలి.
-ఇప్పుడు స్టవ్ ఆపేసి అందులోని మొత్తాన్ని చల్లారనివ్వాలి.
-తర్వాత మిక్సీ జార్ లో ముందుగా వేయించి పల్లీల మిశ్రమం, బీరకాయ టమాటో మిశ్రమం మొత్తాన్ని వేసి ఇందులోనే 6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ముతకగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టీస్పూన్ల ఆయిల్ వేడి చేసి ఇందులో 1 టీస్పూన్ జీలకర్ర,1 టీస్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు, కొద్దిగా ఇంగువ, 1 ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
-ఇప్పుడు దోరగా వేయించిన తాళింపును గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో కలిపండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
