Latest Updates
-
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు! -
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి -
అక్టోబర్‌లో ప్రధాన గ్రహాల రాశి మార్పు.. మేషం నుంచి మీనం వరకు జాతకం ఎలా ఉంటుందంటే.! -
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.!
బాస్మతి రైస్‌తో ఎప్పుడూ బిర్యానీయేనా.. స్పాంజీగా, అలా నోట్లే వేస్తే కరిగిపోయేలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.!
బాస్మతి రైస్ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ. తర్వాత ఫ్రైడ్ రైస్, పులావ్. బాస్మతి బియ్యంతో ఇలాంటివే తప్ప ఇక ఎలాంటి వెరైటీలు చూసి ఉండరు. కానీ ఈ రైస్‌తో హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చని తెలుసా. ఫ్లఫ్ఫీగా, నోట్లో వేస్తే కరిగిపోయేలా, స్పాంజీగా ఉండే ఈ నాస్టాని ఒక్కసారి ట్రై చేశారో.. ఇక వారంలో ఒక్కసారైనా బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకుంటారు. మరి ఈ బియ్యంతో నాస్టా ఎలా చేయాలి.. సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం..

బాస్మతి రైస్‌తో నాస్టా తయారీకి కావాల్సిన పదార్థాలు
బాస్మతి రైస్- 250 గ్రాములు
పచ్చిమిర్చి- రెండు
అల్లం ముక్క- చిన్నది
ఉప్పు- అర టీస్పూన్
పెరుగు- అర కప్పు
బొంబాయి రవ్వ- పావు కప్పు
నూనె- టేబుల్ స్పూన్
ఆవాలు- టీస్పూన్
కరివేపాకు- రెండు రెబ్బలు
ఈనో- 5 గ్రాములు
బాస్మతి రైస్‌తో నాస్టా తయారీ విధానం
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే..
ముందుగా బాస్మతి రైస్‌ను రెండు సార్లు కడిగి మంచి నీళ్లు పోసి మూత పెట్టి గంటపాటు నానబెట్టుకోవాలి.
గంట తర్వాత నీళ్లు తీసేసి బియ్యం మిక్సీ జార్‌లో వేసి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు, పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్‌లోకి తీసుకుని అందులో బొంబాయి రవ్వ వేసి కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఈ పది నిమిషాల్లో పిండి కొద్దిగా ఆకృతి మారుతుంది. అవసరమైతే కొన్ని నీళ్లు కలిపి ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకోండి.
తర్వాత చిన్న పాన్‌లో నూనె, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుని ఈ పిండిలో కలపాలి. ఇప్పుడు కొద్దిగా ఈనో వేసి కొన్ని నీళ్లు పోసి కలుపుకోండి. ఈనో ఇక్కడ ఆప్షనల్. నచ్చిన వారు ఉపయోగించవచ్చు.
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.!
ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లేదా పాత్ర తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి స్టవ్‌పైన పెట్టుకుని నీళ్లు కాగనివ్వాలి. ఈ లోపు స్టీమింగ్ చేసే ప్లేట్ తీసుకుని దానిపై కొద్దిగా నూనె అప్లై చేసి ప్రిపేర్ చేసి పెట్టుకుని స్టీమింగ్ ప్లేట్‌పైన ఇడ్లీ మందంలో పోసుకోవాలి.
ఈ ప్లేట్‌ను కుక్కర్‌లో పెట్టి పావు గంటపాటు హై, మీడియం మంటపైన ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరో పది లేదా పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
తర్వాత మూత తీసి చిన్న గరిటె సాయంతో ఉడికిన నాస్టాను ప్లేట్‌లోకి తీసుకోవాలి. గుండ్రంగా ఉన్న నాస్టాను మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. అంతే టేస్టీ అండ్ హెల్తీ నాస్టా రెడీ. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇది ఎంతో ఆరోగ్యకరం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
