Latest Updates
-
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.!
ఈ కూర కేవలం నెల్లూరులో మాత్రమే దొరుకుతుంది.. రుచి అద్భుతం, మనం ఇంట్లో ఎలా చేసుకోవాలంటే?
మనకు ఉదయం బ్రేక్ఫాస్ట్ సాయంత్రం, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ఎంత ముఖ్యమో.. అవి తినడానికి అందులో వండుకునే కూర కూడా అంతే ముఖ్యం. మంచి రకమైన కూర ఉంటేనే తిన్న ఆహరం రుచికరంగా ఉంటుంది. అలాగే ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ఒకవేళ కర్రీస్ బాగోలేకపోతే అవి తిన్న ఫీలింగ్ కూడా కలగదు. అంత చప్పగా అనిపిస్తుంది. అయితే చాలా మందికి కూరలు అంటే అంత ఆయిల్ వేసేసి కొన్ని కూరగాయలు వేసి చేసుకోవడం అని అనుకుంటారు. కానీ మన పాతకాలంలో చక్కగా చుక్క ఆయిల్ లేకుండా వండుకునే వంటలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వంటకాల్లో ఒకటే ఈ వంకాయ బజ్జి. ఈ వంటకం నెల్లూరులో చాలా ఫేమస్. ఎంతో ఇష్టంగా దీనిని తింటూ ఉంటారు. కానీ ఇది ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలియదు. తెలియకపోతే ఏం.. ఈ స్టోరీని పూర్తిగా చదివి ఈ వంకాయ బజ్జిలు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? చేసుకునేటప్పుడు పాటించాల్సిన పద్ధతులు ఏంటి అనేది తెలుసుకోండి.
వంకాయ బజ్జిలు తయారీకి కావాల్సిన పదార్థాలు
తెల్ల లేత వంకాయలు - 8
మీడియం సైజు ఒక ఉల్లిపాయ
మూడు మీడియం సైజు టమోటాలు
ఒక పచ్చి మామిడికాయ
ఏడు పచ్చి మిరపకాయలు
ఒక చెంచా కారం
ఒక చెంచా పసుపు
రెండు చెంచాల నూనె
రుచికి సరిపడా ఉప్పు
ఒక చెంచా నెయ్యి
నాలుగు వెల్లుల్లి రెబ్బలు
ఒక చెంచా ఆవాలు
ఒక చెంచా జీలకర్ర
ఒక చెంచా పచ్చి శనగ పప్పు
నాలుగు ఎండు మిరపకాయలు
గుప్పెడు కరివేపాకు ఆకులు

నెల్లూరు స్టైల్ వంకాయ బజ్జి తయారీ విధానం
ఈ నెల్లూరు స్టైల్ వంకాయ బజ్జి తయారు చేసుకోవడానికి ముందుగా.. ఒక బౌల్ తీసుకొని అందులో రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలను శుభ్రంగా కడుక్కొని.. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలను ఉప్పు కలిపిన నీటిలో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన వంకాయ ముక్కలు నల్లగా మారకుండా ఉంటాయి.
ఇప్పుడు టమోటోలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ మాదిరిగానే పచ్చి మిర్చిని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మామిడి కాయలో సగాన్ని తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ బౌల్లో వేసుకోవాలి. అన్నీ కట్ చేసుకోవడం ఐపోయాకా.. ఒక గిన్నెలో వంకాయ ముక్కలు, టమాటో ముక్కలు, మామిడి కాయ ముక్కలు వేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, ఒక చెంచా కారం, ఒక చెంచా పసుపు, ఒక చెంచా నూనె వేసుకొని.. స్టవ్ ఆన్ చేసి.. స్టవ్ మీద పెట్టుకోవాలి. వాటన్నిటినీ ఒక్కసారి కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి.
ఎండలో వెళ్ళేటప్పుడు ఈ షర్బత్ తాగి వెళితే వడదెబ్బ తగలదు, చర్మం కూడా నల్లగా మారదు.. ఎలా చేసుకోవాలంటే?
ఆ ముక్కలన్నీ ఉడికిన తరువాత కిందకి దించేసి ఒక పది నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ మిశ్రమం మొత్తాన్ని పప్పు గుత్తితో లేదా రోటిలో వేసుకొని బాగా రుబ్బుకోవాలి. ముక్కలన్నీ బాగా నలిగే విధంగా బాగా రుబ్బుకుంటే కూర రుచికరంగా ఉంటుంది. రుబ్బుకొని ఒక గిన్నె తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టౌ ఆన్ చేసి.. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక చెంచా నెయ్యి, ఒక చెంచా నూనె వేసుకోవాలి. అలాగే అందులోనే ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా పచ్చి శనగ పప్పు, నాలుగు ఎండు మిరపకాయలు, గుప్పెడు కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వాటిని ఉల్లిపాయ ముక్కలు లేత గోధుమ రంగులోకి మారేంత వరకు వేయించుకొని.. ముందుగా రుబ్బి పెట్టుకున్న వంకాయ బజ్జిపై వేసుకొని కలుపుకుంటే ఎంతో రుచికరమైన నెల్లూరు స్టైల్ వంకాయ బజ్జి సిద్ధమైనట్లే. వేడి వేడి అన్నంలో దీనిని కలుపుకొని తింటుంటే ఆ రుచి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మీరూ ఓసారి ట్రై చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications