Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా?
ఎప్పుడూ అవే దోశలు తిని తిని మీకు బోర్ కొట్టిందా? అయితే ఈసారి కరకరలాడే సగ్గుబియ్యం దోశ ట్రై చేయండి. ఇది పైన కరకరలాడుతూ, లోపల దూదిలా మెత్తగా ఉండి అమృతంలా అనిపిస్తుంది. ఉపవాస సమయంలో కడుపుకు తేలికగా ఉండే బ్రేక్ ఫాస్ట్ గా లేదా భోజనంగా కూడా ఇది అద్భుతమైన ఎంపిక.
పైగా సగ్గుబియ్యం దోశ తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనే లేదు. మన ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే, అతి తక్కువ సమయంలో ఎంతో సులభంగా ఈ నోరూరించే దోశను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

సగ్గుబియ్యం దోశ తయారీకి కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం - 1 కప్పు
ఉడికించిన బంగాళదుంపలు - 2
పచ్చిమిర్చి - 2 లేదా 3
జీలకర్ర - అర టీస్పూన్
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
వేయించిన వేరుశెనగ గుళ్లు - 2 టేబుల్ స్పూన్లు
బక్వీట్ పిండి - 2 టేబుల్ స్పూన్లు
రాతి ఉప్పు- రుచికి సరిపడా
నీళ్లు - పిండి కలుపుకోవడానికి తగినన్ని
నెయ్యి లేదా నూనె - దోశలు కాల్చుకోవడానికి
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
సగ్గుబియ్యం దోశ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో సగ్గుబియ్యాన్ని తీసుకుని, రెండుసార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి సుమారు 4 నుండి 5 గంటల పాటు నానబెట్టాలి. సగ్గుబియ్యం బాగా ఉబ్బి, చేత్తో మెదిపితే మెత్తగా అయ్యేలా చూసుకోవాలి. నానిన తర్వాత అందులో ఉన్న అదనపు నీటిని పూర్తిగా వంపేసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని, అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, పెరుగు, వేయించిన వేరుశెనగ గుళ్లు వేసి కొద్దిగా బరకగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను మెత్తగా మాష్ చేసి వేయాలి. దీనికి బక్వీట్ పిండి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు కలపాలి. అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మన రెగ్యులర్ దోశ పిండిలా కలుపుకోవాలి.
-స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ లేదా ఐరన్ పెనం పెట్టి వేడి చేయండి. పెనం వేడెక్కాక కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి, ఒక గరిటెడు పిండిని తీసుకుని గుండ్రంగా, సమానంగా నెమ్మదిగా పరచండి. దోశ మరీ మందంగా ఉంటే కరకరలాడదు కాబట్టి, కాస్త పల్చగానే ఉండేలా చూసుకోవాలి.
-మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి దోశను కాల్చండి. అంచుల వెంబడి కొద్దిగా నెయ్యి వేయండి. అడుగు భాగం బంగారు గోధుమ రంగులోకి మారి కరకరలాడేలా వేగిన తర్వాత, దోశను నెమ్మదిగా రెండో వైపుకు తిప్పి అటు కూడా చక్కగా కాల్చుకోవాలి.
-అంతే వేడివేడి, కరకరలాడే సగ్గుబియ్యం దోశ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
