Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
ఉదయం హడావుడి లేకుండా..లంచ్ బాక్సులోకి టేస్టీ ఆనియన్ మసాలా రైస్..కేవలం 10 నిమిషాల్లోనే!
ఉదయాన్నే హడావుడి లేకుండా సింపుల్ గా,టేస్టీగా లంచ్ బాక్సులోకి చేయాలన్నా, ఇంట్లో కూరగాయలు లేకున్నా జస్ట్ 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ ఆనియన్ మసాలా రైస్ ట్రై చేయండి. లంచ్ బాక్సులకే కాదు లంచ్ లోకి అయినా లేదా డిన్నర్ లోకి అయినా ఒక రైస్ వెరైటీ చేసుకోవాలంటే ఇది పర్ఫెక్ట్ టైమ్ సేవింగ్ రెసిపి.
కేవలం 2 ఉల్లిపాయలు ఉంటే చాలు ఈ టేస్టీ రెసిపిని చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. ఆనియన్ మసాలా రైస్ కేవలం 10 నిమిషాల్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-ఆయిల్
-ఉప్పు
-కారం
-పసుపు
-జీడిపప్పు
-మిరియాల పొడి
-ధనియాల పొడి
-ఉల్లిపాయలు
-పచ్చిమిర్చి
-బిర్యానీ ఆకు
-గరం మసాలా పౌడర్
-జీలకర్ర
-కొత్తిమీర
-పుదీనా
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-నిమ్మరసం
తయారీ విధానం
-ముందుగా 1 గ్లాసు బాస్మతి బియ్యం లేదా మాములు బియ్యం కుక్కర్ లో వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. కడిగిన నీళ్లు వంపేసి ఒకటిన్నర గ్లాసు నీళ్లు(సోనామసూరి అయితే 2 గ్లాసులు) బియ్యంలో పోసి,ఇందులోనే 1 టీస్పూన్ ఆయిల్, చిటికెడు ఉప్పు కూడా వేసి కుక్కర్ మూతపెట్టి మీడియం మంట మీద ఉడికించాలి.
-2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించిన తర్వాత స్టవ్ ఆపేసి,ప్రెజర్ మెత్తం పోయిన తర్వాత మూత తీస్తే రైస్ పొడి పొడిగా ఉడికి ఉంటుంది. దీనిని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత ఒక గిన్నెలో పావు కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ మిరియాల పొడి, 1 టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ గరం మసాలా పౌడర్ వేసి మెత్తం బాగా కలిసేలా కలుపుకొని పక్కన ఉంచుకోండి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాక అందులో 1 టీస్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసి కొంచెం దోరగా వేయించాక ఇందులోనే 1కప్పు పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు,2 పచ్చిమిరపకాయల చీలికలు,కొంచెం కరివేపాకు వేసి వేయించాలి.
-మీడియం మంట మీద ఉల్లిపాయలు మంచి బంగారు రంగులోకి మారేదాకా వేయించాక అందులోనే 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాక ముందుగా కలుపుకున్న పెరుగు మసాలా మిశ్రమాన్ని కడాయిలో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి.
-మీడియం మంట మీద ఆయిల్ పైకి తేలేవరకు వేపుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు,పుదీనా తరుగు వేసి కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులో ఉడికించుకున్న అన్నం వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోండి. ఒక బద్ద నిమ్మరసం రైస్ లో పిండి కలుపుకోండి. దించేముందుగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర అందులో చల్లుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపేయండి. అంతే ఆనియన్ మసాలా రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications