Latest Updates
-
రొటీన్ లంచ్ బాక్స్ బోర్ కొడుతోందా? అయితే ఈ పుచ్చకాయ రైస్ టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు! -
తుల, మిథున, కుంభ రాశుల వారికి శుక్రవారం ధనయోగం.. మీ రాశి ఉందా? - శుక్రవారం, 03 ఏప్రిల్ 2026 -
గుడ్ ఫ్రైడే 2026..మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
కరకరలాడే పనీర్ కట్లెట్స్..రెస్టారెంట్ కి మించిన టేస్ట్ తో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పక్కా స్ట్రీట్ స్టైల్ మోమోస్ చట్నీ..దీన్ని నంజుకొని తింటుంటే ఎన్నైనా అలా పోతూ ఉంటాయ్! -
రోజూ తినే రైతాతో బోర్ కొట్టిందా? అయితే కమ్మని తడ్కా వెజిటబుల్ రైతా ట్రై చేయండి! -
శాడిస్ట్ పెళ్లాంతో తట్టుకోలేకపోతున్నా: భార్య శృంగార కోరిక తీర్చలేక..పోలీస్ స్టేషన్ లో భర్త కంప్లెయింట్! -
రైస్ పొటాటో ఊతప్పం..ఇంతకుముందు తిన్న ఊతప్పం రుచులన్నీ మర్చిపోతారు! -
Hanuman Mantras: మోస్ట్ పవర్ ఫుల్ హనుమాన్ మంత్రాలు..దెయ్యాలు కూడా గజగజ వణకాల్సిందే! -
సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - గురువారం, 02 ఏప్రిల్ 2026
చుక్క నీరు,ఉల్లి,వెల్లుల్లి లేకుండానే..జార్ఖండ్ ఫేమస్ అత్తే మటన్..దీని రుచికి ఫిదా అవ్వాల్సిందే!
మటన్.. ఈ పేరు వినగానే మాంసాహార ప్రియుల నోట్లో నీళ్లు ఊరడం ఖాయం. వీకెండ్ వచ్చిందంటే చాలు, చాలామంది ఇళ్లలో ఘుమఘుమలాడే మటన్ కూర ఉడికిపోవాల్సిందే. మటన్ తో రకరకాల వంటకాలు చేస్తుంటారు. అయితే, సాధారణంగా మటన్ వండాలంటే బోలెడంత ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రేవీ కోసం నీళ్లు వాడటం మనకు అలవాటు. కానీ, మీరు ఎప్పుడైనా జార్ఖండ్ లోని డియోఘర్ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ అత్తా మటన్ రుచి చూశారా?
ఈ అత్తే మటన్ తయారీ విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో చుక్క నీరు కూడా పోయరు. ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా వాడరు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, పాతకాలం నాటి సాంప్రదాయ పద్ధతిలో వండే ఈ మటన్ రుచి మాత్రం జన్మలో మర్చిపోలేరు. కేవలం స్వచ్ఛమైన నెయ్యి, నిండు మసాలా దినుసులతో మాత్రమే దీనిని వండుతారు. డియోఘర్ స్పెషల్ అత్తే మటన్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
అత్తే మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
లేత మటన్ - 1 కిలో
నెయ్యి - 400 గ్రాములు
బిర్యానీ ఆకు
పచ్చ యాలకులు
నల్ల యాలకులు
లవంగాలు
జీలకర్ర
దాల్చినచెక్క
జాపత్రి
నల్ల మిరియాలు
దంచిన పచ్చిమిర్చి
దంచిన అల్లం
ఉప్పు
అత్తే మటన్ తయారీ విధానం
-ముందుగా ఒక కిలో తాజా, లేత మటన్ తెచ్చుకోవాలి. దానిని రెండు మూడు సార్లు శుభ్రమైన నీటిలో బాగా కడిగి, నీరు మొత్తం పోయేలా వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి ఇనుప కడాయిని పొయ్యి మీద పెట్టండి. ఇనుప పాత్రలో వండటం వల్ల మటన్ కు అద్భుతమైన రుచితో పాటు మంచి రంగు కూడా వస్తుంది. కడాయి వేడెక్కాక అందులో 400-500 గ్రాముల నెయ్యి వేయాలి.
-నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అందులో ఘుమఘుమలాడే మసాలా దినుసులన్నింటినీ (బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క తదితరాలు) వేసి వేయించాలి.
-మసాలా దినుసులు చక్కగా వేగిన తర్వాత, కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలను అందులో వేయాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, సుమారు 45 నిమిషాల పాటు నేతిలోనే మటన్ ను ఓపికగా వేయించాలి. ఈ సమయంలో మటన్ తనలోని సహజసిద్ధమైన రసాలతో నేతిలో ఉడుకుతుంది.
-45 నిమిషాల తర్వాత, దంచిన పచ్చిమిర్చి, అల్లం పొడి లేదా దంచిన అల్లం వేసి మళ్లీ వేయించడం కొనసాగించాలి.
-మటన్ ముక్కలు పూర్తిగా మెత్తబడి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా తయారయ్యే వరకు నెమ్మదిగా వేయించాలి. మాంసం చక్కగా ఉడికింది అనిపించాక, చివరగా మీ రుచికి తగినట్లుగా ఉప్పును జోడించండి. ఉప్పు వేసిన తర్వాత మటన్ ముక్కలకు పట్టేలా మరో ఐదు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆపేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే డియోఘర్ స్పెషల్ అత్తే మటన్ రెడీ. వేడివేడి అన్నం, రోటీ లేదా నాన్ తో దీనిని వడ్డిస్తే ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












