Latest Updates
-
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!
ఎగ్ సేమియా: వరల్డ్ ఎగ్ డే స్పెషల్
గుడ్డు మంచి పౌష్టికాహారం. చిన్నపిల్లలు మొదలుకొని, ముసలివారి వరకు డాక్టర్లు గుడ్డు తినమని చెబుతారు. కోడిగుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రొటీన్లను అందజేస్తుంది. పోష కాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా వైద్యులు సలహాలిస్తుంటారు.
ఆమ్లెట్ ఎవరైనా వేస్తారు. గుడ్డుకూర చేసినవారే దూకుడులా హిట్ కొడతారు. పైన తెల్లసొన లోన పచ్చసొన విడువలేని ఆస్వాదన. హఠాత్తుగా ఊడిపడే అతిథులకు చికెనూ మటనూ లేకున్నా గుడ్డే ఘనగౌరవం. ఉడకబెట్టిన గుడ్లతో చేసే ఏవంటైనా సరే నో డౌట్ వెరీ గుడ్. ఈ రోజు వరల్డ్ ఎగ్ డే. గుడ్ల వాడకాన్నీ, దానిలోని ఆరోగ్య ప్రయోజనాల్ని ప్రపంచవ్యాప్తంగా గల ప్రజలకు తెలియజెప్పుతూ ప్రతియేట అక్టోబరు రెండో శుక్రవారం నాడు ‘వరల్డ్ ఎగ్ డే' నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీకోసం ఒక స్పెషల్ వంటకం..

కావల్సిన పదార్థాలు:
కోడిగుడ్లు: 3(ఉడికించి, పొట్టు తీసినవి)
సేమియా: 11/2cup(వెర్మిసెల్లి)
చాట్‌మసాలా: 1tsp
నిమ్మరసం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
మిరియాల పొడి: 1/2tsp
కోడిగుడ్డు: 1(ఉడకబెట్టినది)
నూనె: వేయించడానికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక పాత్రలో సేమియా, చాట్ మసాలా, నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి, అందులో కోడిగుడ్డును పగలగొట్టి లోపలి సొన వేసి బాగా కలపాలి.
2. తర్వాత ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమమంతా బాగా పట్టేలా తిప్పాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి నూనె కాగనివ్వాలి.
4. తర్వాత ఆ గుడ్డును తీసి నూనెలో వేసి సేమియా మిశ్రమం గోధుమరంగులోకి మారేంతవరకు అటూ ఇటూ తిప్పి వేయించాలి.
5. బయటకు తీసి బ్లాటింగ్ పేపర్‌మీద పెట్టాలి. గుడ్డుకు అంటుకొని ఉన్న అదనపు నూనె పేపర్ పీల్చుకున్నాక ఆ గుడ్డును కత్తితో గుండ్రని ముక్కలుగా కట్‌చేసి లేదా అలాగే సర్వ్ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications











