Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
గ్రీన్ అచారీ మటన్ మసాలా : హైదరాబాదీ స్పెషల్
హైదరాబాది వంటలు వేటికవి ప్రత్యేకంగా ఉంటాయి. రుచిలో కానీ, ప్లేవర్లో కానీ, చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాది వంటలకు ఎక్కువగా ఇండియన్ మసాలా దినుసులను ఉపయోగించడం వల్ల అద్భుతమైన రుచి, రంగు, వాసనతో ప్రతి ఒక్కరినీ నోరూరిస్తుంటాయి . హైదరాబాది ఆఛారి మటన్ మసాల ఒకటి.
హైదరాబాది ఆఛారిక ముర్గ్ రిసిపి ఫ్లవర్ ఫుల్ రిసిపి . ఎందుకంటే ఈ వంటకోసం జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఉల్లిపాయ విత్తనాలను ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. అందుకే చాలా డిఫరెంట్ టేస్ట్ ను కలిగి ఉంటుంది . ఈ స్పైసీ అండ్ డెలిషియస్ డిష్ ను మీరు కూడా రుచి చూడాలంటే లేదా స్పెషల్ గెస్ట్ లకు ఆతిద్యం ఇవ్వాలన్నా ఈ రిసిపిని స్పెషల్ గా వండి పెట్టండి.

మటన్: 1/2kg
నూనె: ¼ cup
నూనె: 1tsp
మసాలాలు: ½ tsp
ధనియాలపొడి : 1 tsp
పోపుకోసం
నూనె: 2 tbsp
ఆవాలు: ½ tsp
ఉల్లిపాయ విత్తనాలు: ½ tsp
పెరుగు: 1 cup
కొత్తిమీర : ½ bunch
ఉల్లిపాయ పేస్ట్ కోసం :
ఉల్లిపాయలు: 2(పెద్దవి)
కొత్తిమీర: ½ cup
పచ్చిమిర్చి: 10
అల్లం: కొద్దిగా
వెల్లుల్లి రెబ్బలు: 10
అచారి మసాలా కోసం :
సోంపు: 1tsp
జీలకర్ర: 1tsp
ఆవాలు: ½tsp
ఉల్లిపాయ విత్తనాలు: ½tsp
మెంతులు: ¼tsp
తయారుచేయు విధానం :
మొదట ఉల్లిపాయ పేస్ట్ తయారుచేసుకోవడం:
1. మిక్సీ జార్ లో ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం మరియు వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. అఛారీ మసాలా :
1. మిక్సీలో సోంపు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు మరియు మెంతులు వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఈ పోడిలో పెరుగు మరియు కొత్తిమీర కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో అచారి మసాలా వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి 5నిముషాలు ఫ్రై చేయాలి.
5. తర్వాత శుభ్రం చేసి పెట్టుకొన్న మటన్ ముక్కలను అందులో వేసి 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులో ఉప్పు, మసాలాలు, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.
7. ఒక కప్పు నీళ్ళు పోసి 15నిముషాలు ఉడికించుకోవాలి. కుక్కర్ లో పెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
8. తర్వాత స్టౌ మీద నుండి కుక్కర్ క్రింది దింపుకొని, అందులో పెరుగు పేస్ట్ ను వేసి మిక్స్ చేయాలి .
9. పెరుగు పేస్ట్ ను మిక్స్ చేసిన తర్వాత కుక్కర్ తిరిగి స్టౌ మీద పెట్టి తక్కువ మంట మీద గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి .
10. మటన్ మెత్తగా ఉడికిన తర్వాత చివరగా పోపుకు సిద్దం చేసుకొన్న పదార్థాలు పోపు వేసి, స్టౌ ఆఫ్ చేయాలి. అంతే గ్రీన్ అచారీ మటన్ మసాలా రెడీ..వేడి వేడిగా సర్వ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications











