Latest Updates
-
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!
లో ఫ్యాట్ కర్డ్ చికెన్ కర్రీ రిసిపి
చికెన్ ఒక ఆరోగ్యకరమైన మాంసాహారం. బరువు తగ్గించుకోవాలని ప్లాన్ చేసే వారు ఈ చికెన్ ను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు . ఈరోజు మీకోసం ఒక సింపుల్ అండ్ టేస్టీ చికెన్ రిసిపిని పరిచయం చేస్తున్నాము. ఈ చికెన్ రిసిపికి పెరుగు చేర్చడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ రిసిపి యొక్క ప్రత్యేకత చికెన్ కు పెరుగును చేర్చి వండటమే . అంతే కాదు, పెరుగు చేర్చడం వల్ల వేసవిలో బాడీహీట్ తగ్గుతుంది. త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే బరువు తగ్గాలనుకొనే వారికి ఇది ఒక లోఫ్యాట్ కర్రీ. లీన్ చికెన్ లో చాలా తక్కువ క్యాలరీలుండటం వల్ల బరువు పెరువు పెరుగుతామనే భయం ఉండదు. మరి ఈ సింపుల్ లోఫ్యాట్ చికెన్ కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం...

చికెన్: 1/2 kg
కారం: 2 tbsp
ఆవాలు: 1 tsp
పసుపు: 1 tsp
ధనియా పౌడర్: 1tbsp
అల్లం & వెల్లుల్లి పేస్ట్: 1tbsp
ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
నూనె: 2tbsp
నీరు: 1cup
పెరుగు: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా కుక్కర్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
2. రెండు నిముషాల తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయముక్కలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపూ ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులోనే కారం, పసుపు, ధనియాల పొడి వేసి మరో నిముషం ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత సరిపడా నీళ్ళు పోసం పోపు మొత్తం ఉడకనివ్వాలి.
5. ఇప్పుడు అందులో చికెన్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి, కుక్కర్ కు మూత పెట్టాలి. ఒకటి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉండి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
6. 5నిముషాల తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత తీసి చికెన్ కు పెరుగు మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరో 5నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి .



Click it and Unblock the Notifications











