For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ ఎగ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్

|

మనకందరికీ నచ్చిన ఫేవరెట్ డిష్ లలో ఎక్కువ ఇష్టమైనది మరియు అతి త్వరగా తయారుచేసుకొనే రైస్ ఐటమ్ ఫ్రైడ్ రైస్. ముఖ్యంగా ఎగ్ వెజిటేబుల్ ఫైడ్ రైస్ చాలా సులభంగా, అతి త్వరగా మరియు టేస్టీగా పూర్తి న్యూట్రీషియన్స్ తో తయారయ్యే వంట ఎగ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. అయితే ఎప్పుడూ చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఎగ్ మరియు వెజిటేబుల్స్ మిక్స్ చేసి తయారు చేసుకోవచ్చు.

పచ్చిబఠాలనీలు మరియు ఫ్రెష్ వెజిటేబుల్స్, వెనిగర్, సోయాసాస్ చేర్చడం వల్ల ఈ ఎగ్ వెజ్ ఫ్రైడ్ రైస్ మరింత టేస్ట్ గా ఉంటుంది. తాజా వెజిటేబుల్స్, ఎగ్ మరియు పచ్చిబఠానీలు, టమోటో ఉపయోగించి కొంచెం డిఫరెంట్ టేస్ట్ తో తయారుచేస్తున్నాం. దీన్ని చాలా మంది ఇష్టపడుతారు. ఇది ఒక రుచికరమైన హెల్తీ అండ్ న్యూట్రీషియన్ డిష్. మీకుటుంబ సభ్యులతో పాటు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. గ్రీన్ పీస్-ఎగ్ కాంబినేషన్ ఫ్రైడ్ రైస్ మీకు ఒక కొత్త ట్రీట్ అనిపించవచ్చు. కాబట్టి, ఈ రుచికరమైన నాన్ వెజిటేరియన్ రిసిపి తయారుచేయడానికి ఇది ఒక మంచి సమయం. మరి దీన్ని ఎలా తయారుచేయాలో ఒక సారి చూద్దాం..ఎగ్ వైట్(గుడ్డు తెల్లసొన)లోని గొప్ప ప్రయోజనాలు

Spicy Egg Vegetable Fried Rice

కావల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్ : 2cups
ఎండుమిర్చి: 2-3
వెల్లుల్లి రెబ్బలు: 4-6
అల్లం తురుము: 1/2tsp
నూనె లేదా నెయ్యి: సరిపడా
క్యారెట్లు: 2
చైనీస్ క్యాబేజ్ తురుము: 1/2cup
గుడ్లు: 2
ఉల్లికాడలు: 2
ఫ్రెష్ బఠానీలు: 1/2cup
సోయాసాస్: 1tsp
వెనిగర్: 1/4tsp
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర : కొద్దిగా

ఉడికించిన గుడ్డులోని టాప్ 10 గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

తయారుచేయు విధానం:
1. ముందుగా బాస్మతి బియ్యంను శుభ్రంగా కడిగి, సరిపడా నీళ్ళు పోసి అన్నం వండి పక్కన పెట్టుకోవాలి.
2. అలాగే గుడ్డును పగులగొట్టి గిన్నెలో పోసి అందులో చిటికెడు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత మిక్స్ జార్ లో వెల్లుల్లి, ఎండుమిర్చి, చిటికెడు ఉప్పు వేసి మెత్గా పేస్ట్ చేసుకోవాలి.
4. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అల్లం తురుము వేసి వేయించుకోవాలి.
5. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి. అందులోనే సోయా సాస్, వెనిగర్ కూడా వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పెట్టుొకన్న అన్నం వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కకు తీసి పెట్టుకొని.
7. అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత గుడ్డు మిశ్రమాన్ని పోసి వేగించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న వెజిటేబుల్ రైస్ వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే స్పైసీ ఎగ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ....

English summary

Spicy Egg Vegetable Fried Rice :Telugu Recipe

Spicy Egg Vegetable Fried Rice in Telugu. Egg fried rice is something you can easily pack for lunch but you have never thought of making it. This recipe for fried rice takes just about 10 minutes to make and thus a perfect lunch box idea when you are in a hurry.
Story first published: Monday, June 15, 2015, 14:02 [IST]
Desktop Bottom Promotion