వాలెంటైన్ చెట్టినాడ్ చికెన్ బిర్యాని

Vday Special Chettinad Chicken Biryani
కావలసిన పదార్థాలు:
చికెన్: 1/2kg
బాస్మతి రైస్: 1/2kg
నెయ్యి: 2tbsp
కాశ్మీరీ మిర్చి: 5-6
ఉప్పు: రుచికి తగినంత
పుదీనా: 1/2cup
వేయించిన ఉల్లిపాయ తరుగు: 1/2cup
కొత్తిమీర: ఒక కట్ట
కరివేపాకు: ఒక రెమ్మ
పెరుగు: 1cup
మసాలాకోసం:
ఏలకులు: 3-5
దాల్చిన చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 6-8
బిర్యాని ఆకు: 2
సోంప్:1/2tsp
ధనియాలు: 1tsp
జీలకర్ర: 1/2tsp
మిరియాలు: 1/2tsp
ఎండుమిర్చి: 4-6
పచ్చికొబ్బరి తురుము: 1/4cup
నక్షత్ర లవంగాలు: 2-4

తయారు చేయు విధానం:

1. ముందుగా చికెన్‌ ని తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. ఒక పాన్‌లో మసాలా కోసం తీసుకొన్న దినుసులను, పచ్చికొబ్బరి వేసి రోస్ట్ చేసి వేడి తగ్గిన తరవాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
3. పక్కన వేరొక పాన్‌ లో చికెన్ ముక్కలు, పెరుగు, పుదీనా, కరివేపాకు, కాశ్మీరీమిర్చి, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి దగ్గరగా వచ్చే వరకు ఉడికించాలి.
4. అందులో పైన పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కలిపి కాస్త వేయించిన తర్వాత ఉడికించిన రైస్, వేయించిన ఉల్లిపాయ తరుగును కలిపి సర్వింగ్ బౌల్‌ లోకి తీసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఈ బిర్యానీని రైతాతో తింటే మంచి రుచిగా ఉంటుంది.

Story first published: Thursday, February 2, 2012, 17:50 [IST]
Desktop Bottom Promotion