For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యమ్నీ మటన్ కడై రిసిపి: బక్రీద్ స్పెషల్

|

ముస్లింలు బక్రీద్‌ను ఖుర్భాని పండుగ అని కూడా అంటారు. బక్రీద్ పండుగ రోజు ముస్లిం పవిత్ర స్థలమైన మక్కాలో హజ్ యాత్ర జరుగుతుంది. ముస్లిం సోదరులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో రంజాన్ పండుగ మైదటిదైతే..బక్రీద్ రెండవదిగా నిలిచింది. ఈద్‌గాలో నమాజు ముగుస్తుంది. అందరినీ చల్లగా చూడమని కోరే దువా ముగుస్తుంది. ఆ తర్వాత ఈద్ ముబారక్ చెప్పుకునే అలాయి బలాయి ముగుస్తుంది.

ఆ తర్వాత..? ఇంకేముంది... విందులూ వినోదాలే. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, అయినవాళ్లు... అందరూ కలిసి దావత్‌లో కూచుంటారు. మతాలు మర్చిపోయే క్షణాల్లో అందరూ ఆత్మీయులైపోతారు. మటన్, చికెన్, రోటీ, సేమ్యా... ఘుమఘుమలాడే పదార్థాల మధ్య మాటలు నంజుకుంటారు. నవ్వులు పంచుకుంటారు. పండుగలు ఉండాలి. ఒకరి పండుగలో మరొకరి లోగిలి కళకళలాడాలి. ఆ బహార్ కోసం మీకో స్పెషల్ వంట.

మటన్ ను వివిధ రకాలుగా వండుకోవచ్చు. కడై మటన్ కర్రీ చాలా టేస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఇండియన్ మసాలాదినుసులను ఉపయోగించి తయారుచేస్తారు మరియు మటన్ ముందుగానే మ్యారినేట్ చేసి ఫ్రై చేయడం వల్ల చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఇది పంజాబీయుల డిష్. తీన్ని తయారుచేయడం చాలా సులభం. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

mutton recipe

కావల్సిన పదార్థాలు:
మటన్: 250grm
టమోటో: 2(సన్నగా కట్ చేయాలి)
ఉల్లిపాయ పేస్ట్: 1/4cup
అల్లం పేస్ట్: 1/2tbsp
వెల్లుల్లి పేస్ట్: 1/2tbsp
జీలకర్ర: 1/2tbsp
పచ్చిమిర్చి: 3
పెరుగు: 1/4cup
గరం మసాలా : 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 1/2tsp
బిర్యానీ ఆకు: 2
నూనె: 3tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి తర్వాత పెరుగు మరియు ఉప్పుతో మ్యారినేట్ చేసి 20 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
2. పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి వేసి వేగించి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పడు అదే పాన్ లో మటన్ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని ఒకగిన్నెలోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి అందులో జీలకర్ర వేసి ఒకనిముషం వేగించుకోవాలి.
5. ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి మరికొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడుఅందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో 2-3నిముషాలు వేగించుకోవాలి.
7. తర్వాత టమోటో, ధనియాలపొడి, గరం మసాలా, కారం, పసుపు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ మరో 5-10నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 8. ఇప్పుడు అందులోనే మ్యారినేట్ చేసుకొన్న మిశ్రమాన్ని అందులో వేసి బాగా మిక్స్ చేయాలి
9. తర్వాత మటన్ ముక్కలు వేసి మొత్తం మిశ్రమాన్నికలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 15-20నిముషాలు మీడియం మంట మీద మటన్ పూర్తిగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి.
10. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత అందులో ఫ్రై చేసుకొన్న పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే మటన్ కడాయ్ రిసిపి సర్వ్ చేయడానికి రెడీ.

English summary

Yammy Mutton Kadai Recipe for Bakrid

Among the best recipes to try for Bakrid, mutton kadai is a must try recipe. This is easy to cook and can be prepared in no time.
Story first published: Friday, September 25, 2015, 15:54 [IST]
Desktop Bottom Promotion