Latest Updates
-
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్పీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.!
బరువు తగ్గించే,ఆరోగ్యంగా ఉంచే బిర్యానీ ఇదే..మిల్లెట్ వెజ్ ధం బిర్యానీ ఎలా చేసుకోవాలంటే..
సాధారణంగా బిర్యానీ అనగానే ఎవ్వరికైనా బాస్మతి బియ్యంతో చేసే బిర్యానీయే గుర్తుకు వస్తుంది. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి, ఆహారంలో కొత్తదనాన్ని కోరుకునే వారికి మిల్లెట్ వెజ్ ధమ్ బిర్యానీ ఒక అద్భుతమైన ఆప్షన్. ఇది రుచి, ఆరోగ్యం రెండింటినీ మిళితం చేసిన ఒక సూపర్ రెసిపి. సంప్రదాయ ధమ్ బిర్యానీ తయారీ పద్ధతిని పాటిస్తూ బాస్మతి బియ్యానికి బదులుగా మిల్లెట్స్ వాడటం వలన ఈ బిర్యానీ మరింత పోషకమైనదిగా మారుతుంది.
మిల్లెట్స్..ముఖ్యంగా రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అరికెలు, సామలు వంటివి మన పూర్వీకుల ఆహారంలో అంతర్భాగం. కొన్నేళ్ల క్రితం దాకా వీటి వాడకం తగ్గిపోయినప్పటికీ, వాటిలో ఉన్న అపారమైన పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలను మళ్ళీ వాటి వైపు ఆకర్షిస్తున్నాయి. బిర్యానీ అంటే చాలామందికి బరువు పెరుగుతామనే అపోహ ఉంటుంది. కానీ మిల్లెట్ వెజ్ ధమ్ బిర్యానీతో ఆ చింత అవసరం లేదు. ఇది రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందించి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మిల్లెట్స్ లో ఒకటైన సామలతో టేస్టీ ధం బిర్యానీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

మిల్లెట్ వెజ్ ధం బిర్యానీ తయారకి కావాల్సిన
పదార్థాలు
-సామలు
-కొత్తిమీర
-పుదీనా
-నిమ్మరసం
-ఆయిల్
-ఉప్పు
-బిర్యానీ ఆకు
-కారం
-పసుపు
-పచ్చిమిర్చి
-నెయ్యి
-షాజీరా
-రాతిపువ్వ
-అనాస
-ఫ్రెంచ్ బీన్స్
-సోంపు
-కొత్తిమీర కాడలు
-టమాటో
-ఉల్లిపాయ
-పచ్చిబఠాణీ
-బంగాళదుంప
-క్యారెట్
-దాల్చిన చెక్క
-ధనియాలు
-లవంగాలు
-యాలకలు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కొబ్బరి పాలు

మిల్లెట్ వెజ్ ధం బిర్యానీ తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల సామలు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగిన తర్వాత అందులో నీళ్లు పోసి కనీసం 3 గంటలు నానబెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో లీటర్ నీళ్లు పోసి మరిగించాలి. మరుగుతున్న నీళ్లలోనే 4 లవంగాలు, 2 అనాస పువ్వులు 5 యాలకలు, 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అర టేబుల్ స్పూన్ షాజీరా, అర టేబుల్ స్పూన్ సోంపు,పిడికెడు కొత్తిమీర కాడలు, కొంచెం రాతిపువ్వు, కొంచెం దాల్చిన చెక్క వేసి తక్కువ మంట మీద 10-15 నిమిషాలు మరిగించాలి.
-అది మరుగుతున్నప్పుడే మరో కడాయిని స్టవ్ మీద పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి ఇందులో కొంచెం షాజీరా, కొద్దిగా రాతిపువ్వు వేసి వేపాక ఇందులో 1 పెద్ద ఉల్లిపాయ పెద్ద ముక్కలు వేసి అవి లేత బంగారు రంగులోకి వచ్చాక 2 పచ్చిమిర్చి చీలికలు, పావు కప్పు ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు వేసి అరకప్పు కప్పు చెక్కు తీసి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, పావు కప్పు క్యారెట్ ముక్కలు వేసి కలిపి మూతపెట్టి మీడియం మంట మీద వీటిని 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి.
-తర్వాత అందులో ఫ్రెష్ అల్లంవెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి పచ్చవాసన పోయిన తర్వాత అందులో పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం, సరిపడా ఉప్పు వేసి వేపాక 2 టేబుల్ స్పూన్ల ఫ్రోజన్ బఠాణీలు వేపాలి.
-ఇప్పుడు అందులో 2 గంటలు నానబెట్టిన సామబియ్యం వేసి అందులోని చెమ్మ ఆరేదాకా కలుపుతూ ఉండాలి.
-తర్వాత ఇందులో 1 కప్పు కొబ్బరిపాలు వేసి కలపండి.
-కొబ్బరిపాలు ఉడుకుపడుతున్న సమయంలో ఇందులో మరోపక్క స్టవ్ మీద మరుగుతున్న మసాలా నీళ్లను ఓ కప్పు తీసుకొని వడకట్టి ఇందులో పోసి కలపాలి. తర్వాత ఇందులో 1 టమాటో ముక్కలు,కొత్తిమీర తరగుు, పుదీనా తరుగు, కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి మూతపెట్టి అన్నం వండినట్లు వండుకోవాలి.
-70-80 శాతం ఉడికి నీరు ఉబికి వస్తున్న టైంలో మంటను తగ్గించి బిర్యానీమీద అరిటాకు లేదా విస్తరాకు పరిచి దమ్ బయటకు పోకుండా చెయ్యాలి. దానిమీద మూతపెట్టి పావు గంట సేపు వదిలేయాలి. తర్వాత స్టవ్ ఆపేసి మరో 10 నిమిషాలు వదిలేయాలి. తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడి మిల్లెట్ ధం బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications