Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
నూనె చుక్క వాడకుండానే... నోరూరించే మటన్ కూర..ఎలా చేసుకోవాలంటే
నాన్ వెజ్ అంటే చాలామందికి నోట్లో నీళ్లూరించేది మటన్. ముఖ్యంగా తెలంగాణలో ఏ దావత్ లో అయినా నాన్ వెజ్ అంటే మటన్ ఉండి తీరాల్సిందే. పంక్షన్స్ లో మటన్ ముక్కలు సరిగ్గా వేయకపోతే పెద్ద గొడవలు కూడా అయిపోతాయి. అయితే మటన్ కూర అనగానే మనకు గుర్తొచ్చేది నూనెలో వేగే మసాలాల ఘుమఘుమలు. కానీ నూనె లేకుండా కూడా అంతే రుచికరమైన, మరింత ఆరోగ్యకరమైన మటన్ కూరను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా?
మటన్ లో ఉండే సహజమైన కొవ్వుతోనే ఉడికి మసాలాలన్నీ ముక్కకు పట్టి, అద్భుతమైన రుచినిచ్చే ఈ కూర తయారీ చాలా సులభం. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే పద్ధతిలో చేసుకోవడానికి ఇష్టపడతారు. వేడివేడి అన్నం, రోటీ, నాన్ లేదా లచ్చా పరాఠాతో వడ్డిస్తే ఆ రుచి మాటల్లో చెప్పలేనిది. విందు భోజనాల్లో కూడా ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చుక్క ఆయిల్ లేకుండా మటన్ కూర ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
లేత మటన్ - 400 గ్రాములు
ఉల్లిపాయలు - 2
టమోటాలు - 2
అల్లం-వెల్లుల్లి ముద్ద - 1 టేబుల్ స్పూన్
కారం - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
ఉప్పు - మీ రుచికి సరిపడా
నీళ్ళు - అవసరమైనంత
కొత్తిమీర - గుప్పెడు
తయారీ విధానం
-ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
-మసాలాలన్నీ ప్రతి ముక్కకు పట్టేలా చేత్తో కలిపి, మూతపెట్టి కనీసం అరగంట పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు మటన్ లోకి బాగా ఇంకి, కూర రుచి రెట్టింపు అవుతుంది.
-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి నాన్ స్టిక్ పాన్ పెట్టి వేడి చేయండి. పాన్ వేడెక్కాక మ్యారినేట్ చేసిన మటన్ ముక్కలను వేయండి. నూనె వేయకపోయినా మటన్ లోని కొవ్వు నెమ్మదిగా కరిగి, ముక్కలు మాడిపోకుండా వేగుతాయి. ముక్కలు కొద్దిగా రంగు మారే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
-మటన్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు మెత్తబడి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. అడుగంటుతున్నట్లు అనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లుకుని కలుపుకోవచ్చు.
-ఇప్పుడు పాన్ పై మూతపెట్టి మంటను తగ్గించి మటన్ ముక్కలు పూర్తిగా మెత్తబడే వరకు ఉడికించాలి. ఈ ప్రక్రియకు కొంచెం సమయం పడుతుంది. మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ, అవసరమైతే కొద్దికొద్దిగా వేడినీళ్లు పోసుకుంటూ కూర గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించాలి.
-మటన్ మెత్తగా ఉడికి, కూర దగ్గరపడ్డాక చివరగా గరం మసాలా చల్లి,సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించుకుని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఘుమఘుమలాడే మటన్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications





