Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Onion Pickle: ఉల్లిపాయలతో రుచికరమైన నిల్వ పచ్చడి.. కూర లేకపోయినా అన్నంలో తినేయొచ్చు!
ఉల్లిపాయలు ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండాల్సిన అతి ముఖ్యమైన పదార్థం. చిన్న చిన్న కూరల నుంచి బిర్యానీల వరకు ఉల్లిపాయలను వేసుకొని వంటలు చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఉల్లితో కూర వండుకున్నా సరిపోతుంటుంది. అయితే కూర వండుకునే ఓపిక సమయం లేని వ్యక్తులు ఉల్లిపాయలతో నిల్వ పచ్చడి పెట్టుకుంటారు. ఈ పచ్చడి అద్భుతమైన రుచిగా ఉండడంతో పాటు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందజేస్తుంది. ఈ ఉల్లి పచ్చడిని ఎలా నిల్వ చేసుకోవాలి? ఎలా ఈ పచ్చడిని తయారు చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లి నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు
- అయిదు ఉల్లిపాయలు
- మూడు స్పూన్ల బెల్లం తురుము
- చిన్న సైజులో చింతపండు
- 20 ఎండుమిర్చి
- అరకప్పు నూనె
- ఒక స్పూన్ మినపప్పు
- అర స్పూన్ జీలకర్ర
- ఒక స్పూన్ ఆవాలు
- పది వెల్లుల్లి రెబ్బలు
- గుప్పెడు కరివేపాకు
- చిటికెడు ఇంగువ
- రుచికి సరిపడా ఉప్పు
ఉల్లి నిల్వ పచ్చడి తయారీ విధానం
ముందుగా ఉల్లిపాయలను తొక్క తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎండు మిర్చిని నీటిలో వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. మరోపక్క చింతపండును కూడా కొంచెం నీటిలో వేసుకొని నానబెట్టుకోవాలి.
అరగంట తరువాత ఎండుమిర్చి మెత్తగా నానినట్లు నిర్ధారించుకున్న తరువాత ఆ మిర్చిని మిక్సీలో వేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, బెల్లం తురుము, చింతపండు గుజ్జును కూడా అందులో వేసుకోవాలి. వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకోసారి రుబ్బుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయిలో కొంచెం కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆ నూనెలో ఆవాలు, గుప్పెడు ఎండుమిర్చి, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కరివేపాకులు వేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ముందుగా రుబ్బుకొని పెట్టుకున్న ఉల్లి పేస్ట్‌ను వేసుకోవాలి. మంటను లోలో పెట్టుకొని ఆ మిశ్రమాన్ని వేయిస్తూనే ఉండాలి.
పచ్చడి నుంచి నూనె వేరై పైకి తేలిపోయాక, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చడి చల్లారిన తరువాత ఆ పచ్చడిని ఓ సీసాలో వేసుకొని భద్రపరుచుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలతో నిల్వ పచ్చడి సిద్ధమైపోతుంది. దీనిని ఎలాంటి కూరలు లేనప్పుడు వర్షాకాలంలో, చలికాలంలో దీనిని తినేయొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












