Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
శక్తినిచ్చే అద్భుతమైన అల్పాహారం..రాగి బెల్లం రొట్టెలు ఎలా చేసుకోవాలంటే
రాగి బెల్లం రొట్టెలు అనే పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది రుచి, ఆరోగ్యం. ఈ రొట్టెలు శారీరక శ్రమ చేసేవారికి, పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు ఇలా అందరికీ ఎంతో మేలు చేస్తాయి. రాగులు మన పూర్వీకుల కాలం నుండి మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. బెల్లం కూడా సహజమైన స్వీటెనర్ గా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రెండింటి కలయికతో తయారుచేసే రాగి బెల్లం రొట్టెలు ఆరోగ్యానికి, రుచికి గొప్ప ఉదాహరణ. పిల్లలతో చిరుతిళ్లు మాన్పించడానికి ఇవి చేసి పెట్టండి. ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతారు. రాగి బెల్లం రొట్టెలు తయారుచేయడం కూడా చాలా సులభం. రాగి బెల్లం రొట్టెలు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
రాగి బెల్లం రొట్టెలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-బెల్లం తురుము
-రాగి పిండి
-నెయ్యి

రాగి బెల్లం రొట్టెలు తయారీ విధానం
-స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అరకప్పు బెల్లం తురుము, 1 కప్పు నీళ్లు పోసి బెల్లం మొత్తాన్ని పూర్తిగా కరగనివ్వాలి.
-బెల్లం కరిగి నీళ్లు తెర్లుతున్నప్పుడు అందులో 1 స్పూన్ నెయ్యి, 1 కప్పు రాగి పిండి వేసి మీడియం మంట మీద నీరు మొత్తం పీల్చుకొని దగ్గరపడేదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూతపెట్టి 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి.
-మిశ్రమం గోరువెచ్చగా అయిన తర్వాత వీలైనంత మెత్తగా కలుపుకోవాలి. ఎంత మెత్తగా కలుపుకుంటే రోటీలు అంత మెత్తగా వస్తాయి.
-కలిపిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వాటిని పొడి పిండిలో బాగా ముంచి తర్వాత చపాతీ మాదిరి రోల్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసి దానిమీద వత్తుకున్న రోటీ పెట్టి రెండు వైపులా నెయ్యి అప్లయ్ చేస్తూ తిప్పుతూ కాల్చుకోండి. అంతే కమ్మనైన రాగి బెల్లం రొట్టెలు రెడీ.
ప్రయోజనాలు
రాగి, బెల్లం రెండూ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ రెండింటి కలయికతో తయారుచేసిన రొట్టెలు మన శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా ఉదయం అల్పాహారంలో రాగి బెల్లం రొట్టెలను తీసుకుంటే, రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉండవచ్చు. ఇది శారీరక శ్రమ చేసేవారికి, క్రీడాకారులకు చాలా ఉపయోగకరం. రాగి బెల్లం రొట్టెలను తరచూ తినడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల బలహీనత సమస్యలను నివారించవచ్చు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, గర్భిణీలకు, వృద్ధులకు ఈ రొట్టెలు ఎంతో మేలు చేస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
